U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణరాజకీయం

ఆల్ ది బెస్ట్ ఉదయన్న..

ఆల్ ది బెస్ట్ ఉదయన్న..

నామినేషన్ దాఖలు చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి ఇమంది ఉదయ్ కుమార్

ఉదయం కొత్తగూడెం ప్రతినిధి (నవంబర్ 2). …..
స్వార్థపూరిత రాజకీయాలకు స్వస్తి పలికి నోటు ఇచ్చి ఓట్లు పొందే నాయకులకు బుద్ధి చెప్పేందుకు మార్పు కోరుతూ రాజకీయరనరంగంలో నేను సైతం అంటూ వచ్చారు ఇమంది ఉదయ్ కుమార్. నూతనంగా ఆజాద్ అధికార సేన పార్టీ బలపరుస్తున్న కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇమంది ఉదయ్ కుమార్ శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ తన నామినేషన్ను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్థానిక ఆర్డిఓ శిరీష కు అందజేశారు. తన నామినేషన్ను పురస్కరించుకొని కొత్తగూడెంలో కుటుంబ సభ్యులు మరియు కార్యకర్తలతో కలిసి నామినేషన్ కేంద్రానికి తన ప్రచార రథాలతో హోరెత్తించారు. తొలుత రామ టాకీస్ లోని తన పార్టీ కార్యాలయం వద్ద నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఇమంది ఉదయ్ కుమార్ కు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. నామినేషన్ సమర్పించే సమయంలో ఉదయ్ కుమార్ సతీమణి సాంప్రదాయ పద్ధతిలో విజయస్తు అని దీవించి భర్తకు తోడుగా కృష్ణవేణి సైతం నామినేషన్ కార్యక్రమానికి హాజరై ఆల్ ది బెస్ట్ చెప్పారు. నామినేషన్ వేసేందుకు ఉదయ్ కుమార్ తన ప్రచార రథం ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.” మార్పు కోసం నేను సైతం” అనే నినాదంతో ఎన్నికల ప్రచారంతో దూసుకుపోతున్న ఉదయ్ గెలుపు కాంక్షిస్తూ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో జై ఉదయన్న జై జై ఉదయన్న నినాదాలు చేశారు. ఒక అవకాశం ఇవ్వండి కొత్తగూడెం అభివృద్ధిలో మార్పు తీసుకువస్తానని స్థానికుడిగా సమస్యలపై పోరాడే సమకాలికుడిగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ధైర్యం తనకు ఉందని ఈ సందర్భంగా తెలిపారు. కొత్తగూడెంలో మార్పు కోసం యువత ఎదురుచూస్తున్నారని తన అమూల్యమైన ఓటుతో అభివృద్ధికి పాటుపడని ప్రజాప్రతినిధులకు బుద్ధి చెప్పాలని కొత్తగూడెం నియోజకవర్గం లో యువత నిరుద్యోగ మహిళలు రైతులు విద్యార్థులు వృద్ధులు సైతం తన వైపే మద్దతు పలుకుతున్నారని వారంతా నిండు మనసుతో దీవించిన ఆశీర్వాద బలమే తనకు విజయాన్ని సమకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సీనియర్ పాత్రికేయులు సీమకుర్తి రామకృష్ణ, చెంగపొంగు సైదులు, దశరథ్ రజువ, ఇమంది గణేష్, రేవంత్, కమల్, గరిమెళ్ళపాడు ప్రాంతానికి చెందిన అనేక మంది గిరిజనులు పాల్గొన్నారు.

Related posts

స్వతంత్ర టీవీ ఉద్యోగులకు న్యాయం చేసిన టీయూడబ్ల్యూజే

జిల్లా కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ చీకటి కార్తిక్ పై ఆరోపణలు అర్ధరహితం

హవ్వ… సింగరేణిలో ఇంత నాసిరకమా…

Leave a Comment