U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

“గూడెం” ప్రజల గుండెల్లో ఉదయ్ అన్న

“గూడెం” ప్రజల గుండెల్లో ఉదయ్ అన్న
ఇమంది ఉదయ్ అన్నకి మా ఓటు
కొత్తగూడెం నియోజకవర్గంలో విలక్షణ తీర్పు ఇవ్వనున్న జనం
ప్రత్యర్థుల ముచ్చెమటలు పట్టిస్తున్న ఉదయన్న ప్రభంజనం

ఉదయం జిల్లా ప్రతినిధి నవంబర్11

కొత్తగూడెం నియోజకవర్గం లో జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి నియోజకవర్గ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. ఆ తీర్పు కాస్త సరికొత్త మార్పు ఇచ్చేందుకు తన ఎన్నికల ప్రచారంలో సుడిగాలిగా ప్రభంజనం సృష్టిస్తున్న ఆజాద్ అధికార సేన పార్టీ బలపరుస్తున్న కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి ఇక మంది ఉదయ్ కుమార్ వైపే గూడెం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈసారి ప్రజలు ఇచ్చే తీర్పు తో ప్రధాన పార్టీల ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పొత్తులు చిత్తులు గమ్మత్తులు మధ్య ప్రధాన పార్టీలలో రేపుతున్న కలహాలు చూస్తూ ఓటర్లు విసుకు చెందారు. ఇంతకాలం వారి వారి నమ్ముకున్న నాయకుడు గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న కార్యకర్తలను నేతల స్వలాభం కోసం కార్యకర్తలను గాలికి వదిలి దిక్కులేనివారిగా చేసి పబ్బం గడిపే ప్రత్యర్ధులకు బుద్ధి చెప్పాలని సంకల్పంతో ఉన్న కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు సరికొత్త మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. నీతిమాలిన రాజకీయాలను పాతరేస్తూ.. స్వార్థపూరిత రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజా సేవకుడిగా ఐదేళ్లపాటు సేవ చేసేందుకు ముందుకు వస్తున్న ఇమంది ఉదయ్ కుమార్ కి ఈసారి తప్పకుండా ఒక్క ఛాన్స్ ఇవ్వాల్సిందే అంటూ నియోజకవర్గం ప్రజలు చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది . దీంతో జరిగే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రోజురోజుకు చేపడుతున్న వినూత్న ప్రచారాలతో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అడుగుతున్న ఉషోదయ ఫ్లెక్సీ, ఉషోదయ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడైన ఉదయన్నకే మా ఓటు అంటూ ఘంటాపదంగా ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికే కొత్తగూడెం నియోజకవర్గంలో వాడవాడల సుడిగాలి పర్యటన చేస్తూ తన ఎన్నికల ప్రచారాలతో హోరెత్తిస్తున్న స్వతంత్ర అభ్యర్థి గెలుపును ఆపడం ఎవరి తరమని మేధావి వర్గం ఆలోచిస్తుంది. ఆల్ ది బెస్ట్ ఉదయ్ అన్న ఆయన గెలుపు కోసం అనునిత్యం శ్రమిస్తున్న ఆయన సతీమణి కృష్ణవేణి కొడుకు కూతురు గణేష్, ప్రసన్న, ఆజాద్ అధికార సేన జిల్లా మహిళా అధ్యక్షురాలు మల్లూరి అనూష, సీనియర్ పాత్రికేయులు సీమకుర్తి రామకృష్ణ, దశరథ్ రాజువ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

భద్రాద్రి జిల్లాకు రాష్ట్ర స్థాయి సంపూర్ణత అభియాన్ అవార్డు

పెనుబల్లి వంతెనపై భారీ గొయ్యి…భారీ వాహనాలకు నో ఎంట్రీ…

రక్షించాల్సిన పోలీసులే శిక్షిస్తే ఎలా….

Leave a Comment