U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

దళిత కాలనీ పేదలకు శాశ్వత గృహవసతి కల్పించాలినిర్వాసితులైన పేదలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలిపెనుబల్లి వంతెనను తక్షనమే నిర్మించాలి

దళిత కాలనీ పేదలకు శాశ్వత గృహవసతి కల్పించాలి
నిర్వాసితులైన పేదలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలి
పెనుబల్లి వంతెనను తక్షనమే నిర్మించాలి
పాత కొత్తగూడెం ఎస్సి కాలనీని సందర్శించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా

ఉదయం,కొత్తగూడెం డిసెంబర్ 06:
మిగ్ జాం తుఫానుతో నిర్వాసితులుగా మరిన పాతకొత్తగూడెం దళిత కాలనీ కుటుంబాలకు శాశ్వత గృహవసతి కలిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా కోరారు. కొత్తగూడెం పట్టణ పరిధిలోని పాత కొత్తగూడెం దళిత కాలనిని బుధవారం అయన సందర్శించి బాధితులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాతకొత్తగూడెం దళిత కుటుంబాలకు ఇందిరమ్మ గృహాలు మంజూరి చేసిందని, ఈ గృహాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. దళిత పెదాలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని అన్నారు. గడిచిన పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదని విమర్శించారు. వర్షాలు కురుస్తున్న సమయంలో పునరావాస కేంద్రాలకు తరలించి చేతులు దులుపుకున్నారేగాని శాశ్వత పరిస్కారం చూపలేక పోయారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాతకొత్తగూడెం దళిత కాలనీ బాదితులకు తొలిప్రాధాన్యతగా ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలనీ డిమాండ్ చేశారు. అనంతరం చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామ వంతెనను సందర్శించారు. వరదలకు పెనుబల్లి గ్రామా ప్రజలు వినియోగించే బ్రిడ్జి మునుగుతుండడంతో రాకపోకలు స్తంభించి గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వ హయాంలో ఈ సమస్యను అధికారులు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ పట్టింకోలేదని అన్నారు. తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టి పెనుబల్లి ప్రజల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. సందర్శించిన బృందంలో సిపిఐ నాయకులు కంచర్ల జమలయ్య, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, పుట్టి భాగ్యలక్ష్మి, కిలారు ప్రసాద్, రామారావు, వెంకటేశ్వర్లు తదితరులు వున్నారు.

Related posts

ఆల్ ది బెస్ట్ ఉదయన్న..

అర్హత ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లు రాకుంటే పోరాటం తప్పదు.

డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ట్రాఫిక్ ఎస్ఐ నరేష్

Leave a Comment