నాలుగు నెలల్లో చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రధాని మోడీ నాయకత్వంలోనే దేశం సుభిక్షం వందలాది నేతలు, యువకులతో కలిసి…
బీజేపీ లో చేరిన జీవీకే మనోహర్ రావు
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి
ఉదయం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 11
ప్రజలకు లేనిపోని వాగ్దానాలతో నమ్మించి అధి కారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చుక్కలు చూపిస్తుందని దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సుస్థిర పాలనను అందించాలంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వమే అత్యంత అవసరమని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని
ప్రముఖ న్యాయవాది, ఉమ్మడి ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు జీవీకే మనోహర్ రావు బీజేపీ లో చేరారు. ఆయన
నాయకత్వంలో దాదాపు వెయ్యి మంది
వివిధ పార్టీల నేతలు, యువకులు కూడా పార్టీలో చేరారు. ఒక ఫంక్షన్ హాల్ లో జరిగిన సభలో
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి బీజేపీ కండువా కప్పి మనోహర్ రావుకు స్వాగతం పలికారు.మనోహర్ రావు గారి చేరికతో ఖమ్మం లో బీజేపీ విజయం చాలా సులువయ్యిందని మనోహర్ రెడ్డి అన్నారు. నేడు రాష్ట్ర రాజకీయాలు కంపుగా మారాయని, కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం లేకపోయినా అధికారం కట్టపెట్టారని, నాలుగు నెలల్లో చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్ మీద ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే పనికిరాకుండా పోతుందని, దేశాన్ని ప్రపంచంలోనే బలమైన శక్తిగా మారుస్తున్న మోడీని మూడో సారి గెలిపించాలని కోరారు. క్లస్టర్ ఇన్చార్జి మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ- మనోహర్ లాంటి ప్రతిభ గల నాయకుడు పార్టీకి అవసరమని చెప్పారు. ఖమ్మం లో బీజేపీ విజయం ఖాయమయ్యిందని చెప్పారు. మనోహర్ రావు పునరాగమనాన్ని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు హృదయపూర్వకంగా స్వాగతించారు. ప్రజల్లో మోడీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు తన ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. కార్యకర్తలు 30 రోజులు శ్రమిస్తే ఖమ్మం లో కమల వికాసం తథ్యమని చెప్పారు.
ఖమ్మం నియోజకవర్గ ప్రభారి శ్రీకాంత్ మాట్లాడుతూ – 2024 ఎన్నికల వైపు యావత్ ప్రపంచం చూస్తోందని, మోడీ మూడో సారి ప్రధాని అయి భారత్ ను అగ్రదేశంగా మారుస్తారని అన్నారు.
మనోహర్ రావు సెకండ్ ఇన్నింగ్స్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ కి గట్టి ఊపునిచ్చిందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు.
అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ కు బుద్ధిచెప్పి బీజేపిని గెలిపించాలని జిల్లా మాజీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారు. మనోహర్ రావు పార్టీలో చేరడంతో కొత్త ఊపు వచ్చిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్ చెప్పారు.
మోడీ జీ ఇచ్చిన స్ఫూర్తితో…
మనోహర్ రావు మాట్లాడుతూ- తిరిగి సొంత గూటికి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఉన్న ప్రతి పేద బడుగు బలహీనవర్గాలకు చేరుతున్నాయని అని తెలిపారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం లేకపోతే ఎంతో నష్టపోతామని, ఆయన స్ఫూర్తితో పార్టీలో మళ్ళీ చేరుతున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీదుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.బీజేపీ లో చేరిన వారిలో
కిరణ్, రామారావు, రాధాకృష్ణ, హరిప్రసాద్ శివ కృష్ణ, ప్రవీణ్, సన్ని, సోను , సునీల్ సందీప్ నందు నరేష్ శివ, రఘు, సాయి, గౌతం, సురేష్, అశోక్,, బిళ్ల , ప్రేమ్ చిన్న, పాషా, రఘు, తెలంగాణా క్రాంతి, గోపి, వేణు, చెర్రీ ఉదయ కూడా ఉన్నారు.

