U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

భద్రాచలం పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు.ఎస్సై కానిస్టేబుల్ మరో వ్యక్తి అరెస్టు.


ఉదయం /భద్రాచలం.
భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ, కానిస్టేబుల్, సీసీ కెమెరా టెక్నీషియన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన ఘటన గురువారం నెలకొంది. వివరాల్లోకి వెళితే భద్రాచలంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్ భద్రాచలానికి చెందిన సీసీ కెమెరా టెక్నీషియన్ నవీన్ అనే వ్యక్తి సీసీ కెమెరాలు పరిశీలిస్తుండగా ఒక ప్రైవేట్ గోదాము నుంచి ఇద్దరు వ్యక్తులు దొంగతనంగా రెండు పంచదార బస్తాలను దొంగిలించి ఆటోలో తరలించిన దృశ్యాలు కనబడ్డాయి. దీంతో సదరు విషయాన్ని కానిస్టేబుల్ శంకర్ ఎస్ఐ శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా ఎస్సై శ్రీనివాస్ ఆటో తోపాటు దొంగిలించిన బస్తాలు సదరు వ్యక్తులను తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. దొంగలను పట్టుకుని నాలుగు పంచదార బస్తాలను సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న అనంతరం కేసు నమోదు చేయకుండా కానిస్టేబుల్ శంకర్ టెక్నీషియన్ నవీన్ వారితో బేరసారాలకు మాట్లాడుకుని 30 వేలకు వారిని ఒప్పించారు. అంత ఇచ్చుకోలేమని దొంగలు చెప్పినా వినిపించుకోలేదని దొంగలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. జిల్లాకు సంబంధించిన ఏసీబీ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఈ కేసును వరంగల్ ఏసీబీ అధికారులకు అప్పగించారు. గురువారం వరంగల్ నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు డీఎస్పీ సాంబయ్య సిఐలు శ్యామ్ సుందర్ మహేష్ లు. పోలీసులపై ఫిర్యాదు చేసిన సాయి తేజకు 20 వేలు ఇచ్చి పోలీస్ స్టేషన్ కి పంపించారు. ఎస్సై ఆదేశాల మేరకు సీసీ కెమెరాల రూమ్ లో కానిస్టేబుల్ శంకర్ నవీన్ లు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్సై, మీడియటింగ్ చేసిన కానిస్టేబుల్ టెక్నీషియన్ నవీన్ ను ఏసీబీ అధికారులు పట్టుకొని ఏసీబీ ఖమ్మం కార్యాలయంకు అప్పగించనున్నట్లు తెలిపారు.. దీంతో దొంగలు పోలీసులను పట్టించినట్లు అయిందని చర్చించుకుంటున్నారు.

Related posts

మూడు రోజుల్లో మాడవీధుల కు సంబంధించి స్థల సేకరణ ప్రక్రియ పూర్తి చేస్తాం…

మిచౌంగ్ తుఫాను ప్రభావం వల్ల జిల్లాలో పలు చోట్ల చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసలు..

Leave a Comment