U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

పద్మశాలి సంఘం ఎన్నికల కన్వీనర్ గా పుట్టా శంకరయ్య..

ఉదయం/భద్రాద్రి కొత్తగూడెం.
కొత్తగూడెం పద్మశాలి సంఘమునకు సంబంధించిన ఎన్నికల కన్వీనర్ గా తెలంగాణ రాష్ట్ర ఆర్చరీ కోశాధికారి ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పుట్టా శంకరయ్యను ఏకగ్రీవంగా ఆదివారం ఎన్నిక చేశారు. 26 మంది కమిటీ సభ్యులతో ఏర్పాటుచేసిన అడహక్ కమిటీ కన్వీనర్ గా పూర్తి బాధ్యతలు పుట్టా శంకరయ్యకు ప్రస్తుత పద్మశాలి సంఘం అధ్యక్షులు ఆముదాల వెంకట నరసయ్య కార్యదర్శి భోగ నారాయణ సోమవారం సాయంత్రం పద్మశాలి కళ్యాణ మండపంనందు అందజేశారు. పూర్వ అధ్యక్షులు ఆముదాల వెంకట నరసయ్య మాట్లాడుతూ వయసు పైబడిన రీత్యా కమిటీ యొక్క నిర్వహణకు నూతన కమిటీని ఎన్నుకోవాల్సిందిగా సభ్యులందరూ నిర్ణయించినారని తెలిపారు. పూర్తి బాధ్యతలు రానున్న రోజుల్లో ఎలక్షన్ ద్వారా నూతన కమిటీ ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. ఇప్పటినుండి ఎలక్షన్ అడహక్ కమిటీ కన్వీనర్ పుట్టా శంకరయ్య నేతృత్వంలో ఎన్నికలు నిర్వహించి నూతన కమిటీకి బాధ్యతలు అందజేస్తారని తెలిపారు. కన్వీనర్ పుట్టా శంకరయ్య మాట్లాడుతూ కొత్తగూడెం లోని పద్మశాలి కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా తమ యొక్క సభ్యత్వమును నమోదు చేయించుకొని రానున్న రోజుల్లో పద్మశాలి సంఘమునకు నిర్వహించే ఎన్నికలలో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. సంఘ సభ్యులందరూ అత్యధికంగా సభ్యత్వాలను నమోదు చేసి పద్మశాలి నూతన కమిటీని ఎన్నుకొని సంఘమును మరింత అభివృద్ధిలోకి తీసుకు వెళ్లాలని సంఘం బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నూతన అడహక్ కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు

Related posts

ఉదయం ఎఫెక్ట్

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు – కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

గౌతంపూర్ గ్రామ సభలో అధికారులను నిలదీసిన బీజేపి నేతలు..

Leave a Comment