U9udayam.com | Telugu Local News App Latest News
ఉద్యోగాలుక్రీడా వార్తలుక్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణరాజకీయంవ్యవసాయం

సీఎం రేవంత్ ను కలిసిన జర్నలిస్టు సంఘం నేతలు.

సీఎం రేవంత్ ను కలిసిన జర్నలిస్టు సంఘం నేతలు.
జిల్లాలో ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇళ్లకే విజ్ఞప్తి.
సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.
ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.
జర్నలిస్టులందరికీ జిల్లాలో ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కోరారు. శుక్రవారం 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టియుడబ్ల్యూజే ఐజేయు నేతలు మరియు జిల్లాలోని జర్నలిస్టులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దశాబ్దాలుగా జర్నలిస్టు వృత్తిని కొనసాగిస్తూ కనీస సౌకర్యాల కోసం ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులను ఆదరించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దాదాపు పది ఎకరాలు జర్నలిస్టుల కోసం మంజూరై ఉన్నా కానీ పంపిణీలో జాప్యం చేస్తున్నారని వెంటనే జర్నలిస్టులకు అందజేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో టి యు డబ్ల్యూ జే ఐ జేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు దుద్దుకూరు రామారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐజేయు అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులు కనుకు వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ సత్యానంద్, వెలుగు రాజేందర్, వట్టి కొండ రవి, భాస్కర్, శంకర్, నరసింహారావు, పొట్టబత్తిని రాము, నవీన్, కృష్ణ గోవింద్ ,వాహబ్, సతీష్, జమీల్, మధు, సురేష్,గణేష్ తదితరులున్నారు

Related posts

భద్రాద్రి జిల్లాకు రాష్ట్ర స్థాయి సంపూర్ణత అభియాన్ అవార్డు

జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం..

ముఖ్యమంత్రి ఎదురుగా నిరసన తెలిపేందుకు ధైర్యం ఉండాలి.సాహసోపేత పోరాటంపై అభినందనల హర్షం

Leave a Comment