అవగాహన లేని సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఇదే నిదర్శనం
ప్రాజెక్టు కోసం పట్టించుకున్నారా తట్టెడు మన్ను పోశారా .. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ధ్వజం
ఉదయం జిల్లా ప్రతినిధి ఆగస్టు 15.. జిల్లాలో ఉన్న స రైతాంగానికి పుష్కలంగా సాగునీరు అందించేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో రూ .8000 వేల కోట్లతో 90% పనులు పూర్తి చేసిన మాట వాస్తవం కాదా.. ప్రస్తుత పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆ మాటలకు సీతారామ ప్రాజెక్టు పనులే సమాధానం చెప్తాయని ఎంత కాలం అబద్ధం చెప్పి ప్రజలను మోసగిస్తారో చూస్తామని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ధ్వజమెత్తారు. గురువారం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం సందర్భంగా పుసుగుడెంలో విలేకర్ల సమావేశంలో సీఎం మాట్లాడుతూ జిల్లారైతులకు సీతారామ ప్రాజెక్టు నుండి సాగునీరు కావాలని అప్పటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ని గత సాగునీటి శాఖామాత్యులు హరీష్ రావు ని ఎప్పుడు మాజిల్లాకు సాగునీళ్ళు కావాలని అడగ లేదు రేగా కాంతారావు హరిప్రియ అని అనడం సీఎం కి ఈ ప్రాజెక్టు పట్ల పూర్తిగా అవగాహన లేదని ఈ మాటలే నిదర్శనం … నిజంగా సిగ్గు పడుచున్నానుఅని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విమర్శించారు. గొప్పలు చెప్పడం కాదు సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు పనులు 8000 వేల కోట్లతో 90 శాతం పనులు పూర్తిచేసింది మేము అది వాస్తవం కాదా … మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులలో తట్టెడు మట్టి తీసారా ప్రజలు మీ అబద్ధపు మాటలు మాయమాటలు గమనిస్తున్నారు అని ఎద్దేవా చేశారు .స్థానిక ఎన్నికలలో బుద్దిచెప్పడం ఖాయం అని హెచ్చరించారు. తాను తన నియోజకవర్గ రైతుల కోసం శంకుస్థాపన చేసిన మారెళ్లపాడు ట్యాంక్ స్టోన్ చూడండి ఆపనులను ఎందుకు ఆపారో మీ అధికారులను అడగండి . ఇట్టే అర్థమవుతుందని సవాల్ విసిరారు.. ఇంకా జిల్లా రైతుల కోసం అదనపు మంజూరు నిధుల కోసం ఫైల్స్ మీ ఆఫీసులో ములుగుతున్నాయని అవి తెప్పించుకొని మంజూరు ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నానని అన్నారు .తాను ఎందుకు నిరసన చేస్తున్నారు భద్రాద్రి జిల్లా సాగునీళ్ళ సంగతేంటి అని అధికారులను అడగకుండా అవగాహన లేకుండా మేము పనిచేయలేదు అడగలేదు అనడం ముఖ్యమంత్రి మాట్లాడటం వారి అసమర్థ పాలనకు మాయమాటల తీరుకు నిదర్శనంఅని విమర్శించారు. మనజిల్లా రైతుల న్యాయమైన హక్కులను ప్రజల పక్షాన అడిగితే అక్రమ అరెస్టు చేసినందుకు మీరు సిగ్గుపడాలని,స్వాతంత్ర్యం వచ్చిన నాడే మీపై నిరసనల సెగ ఎందుకొచ్చింది ఆలోచించకుండా మాపై నిందలా ఈ పోరాటం అక్రమ అరెస్టులకు బయపడి ఆపేదే లేదు భద్రాద్రి జిల్లాకు సీతారామ ద్వారా సాగునీళ్ళు వచ్చే వరకు బిఆర్ఎస్ పోరాటం చేస్తుందని తెలియజేశారు. భవిషత్ లో రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు.కింద శంకుస్థాపన దిమ్మె ముఖ్యమంత్రి కి కనపడేలా ప్రజలు ప్రశ్నించాలని రేగా పత్రికా పరంగా పిలుపునిచ్చారు.
previous post

