U9udayam.com | Telugu Local News App Latest News
ఆంధ్రప్రదేశ్

బాధితులకు సాయం అందించిన ఫ్లెక్స్ ప్రింటర్స్.

వృత్తి చిన్నదైనా సాయం అభినందించదగినది.
రూ 5 లక్షల డిడిని మంత్రి లోకేష్ కు అందజేత.
ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి లోకేష్ హామీ.
ఉదయం /అమరావతి.
ప్రకృతి విపత్తులు కళ్ళకల్లోలమైన విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ నడుంబిగించింది. పుట్టుక నుంచి జీవన చరమంఖం వరకు ఎన్నో కార్యక్రమాలను తమ ఫ్లెక్స్ ప్రింటింగ్ రూపంలో అందరికీ చేరవేసే మాధ్యమమే ఫ్లెక్స్ ప్రింటింగ్. అటు చిన్న శుభకార్యమైన ఎంతటి గొప్ప రాజకీయ కార్యక్రమమైన ప్రభుత్వ కార్యక్రమమైన ప్రైవేట్ కార్యక్రమమైన ఎన్నో వేల మందికి జీవనోపాధిని ఇస్తుంది ఫ్లెక్స్ ప్రింటింగ్ వృత్తి. జీతం చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలని ఆలోచనతో అసోసియేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా క్లెక్స్ ప్రింటింగ్ నిర్వాహకులంతా తలా ఓ చేయి వేసి మేమున్నాం అండగా అంటూ బాధితులకు భరోసా ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ అభినందనలు పొందింది అసోసియేషన్. ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం నిర్వహించిన విరాళాల సేకరణ లో భాగంగా సేకరించిన 5 లక్షల రూపాయలు డిడిని బుధవారం అసోసియేషన్ సభ్యుల ద్వారా రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పృధ్వి రాంబాబు , రాష్ట్ర అధ్యక్షులు రావూరు రాజశేఖర్ , రాష్ట్ర సెక్రెటరీ మహదేవ్ , ఉపాధ్యక్షులు సుధాకర్ ,ట్రెజరర్ నాగబాబు , గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ ఖాజా పాల్గొన్నారు.

Related posts

ఎస్.ఆర్ డి.జి స్కూల్ విద్యార్థి క్షేమంగా ఉన్నాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు:

తెలంగాణ హాకీలో అంతా గోల్మాల్… జాతీయ క్రీడకు చీడ పడుతుందా?

Leave a Comment