U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

గణేషుడికి వీడ్కోలు పలికిన ఇమంది ఉదయ్ కుమార్.


ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.
అన్నవరాత్రులపాటు పూజలందుకొని అత్యంత వైభవంగా గోదావరి ఒడికి చేరనున్న గణపతులను వీడ్కోలుతో సాగనంపారు భక్తజనులు మంగళవారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిమజ్జన వేడుక వీడ్కోలు కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టియూడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతటి పెద్ద కార్యక్రమం అయినా గొప్ప కార్యక్రమం అయినా శుభ కార్యాలు పెళ్లి వేడుకలు ఏది జరగాలన్నా ముందుగా గణేశుడి పూజ జరగాల్సిందే. అటువంటి గణనాథుడు అన్ని గణాలకు అధిపతి అయి ప్రజలందరినీ లోకమంతటిని కావాలా కాస్తుంటాడని అన్నారు. విద్యలో రాణించాలన్న విజయం సాధించాలన్న ఆది పూజలన్నీ గణేశుడు తోటే ప్రారంభమవుతాయి. అటువంటి గణనాథుడు ప్రతి ఇంటా కొలువై నవరాత్రుల పూజలందుకొని వీధి వీధుల గుండా అత్యంత శోభాయమానంగా భద్రాచలంలో ఉన్న తల్లి గోదావరి లో నిమజ్జనం అయ్యేందుకు సిద్ధమైన వేల అందరూ సాగనంపాలని అన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు చేసిన పోలీసు శాఖ ఏర్పాట్లను తప్పకుండా అభినందించి తీరాల్సిందే అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ధారా రమేష్ బృందం ఏర్పాట్లను సైతం ఉదయ్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు పిల్లి రాజేశ్వరరావు, జల్లారపు శీను, లక్కీ లక్ష్మణ్, రవీందర్, శ్రీనివాస్, పురోహితులు దత్తాత్రేయ శర్మ, తదితరులు పాల్గొన్నారు

Related posts

కొత్తగూడెం డిఎస్పిని అభినందించిన డిజిపి..

జర్నలిస్టుల సమస్యలపై సీఎం సభలో నిరసన.

సీఎం రేవంత్ ను కలిసిన జర్నలిస్టు సంఘం నేతలు.

Leave a Comment