ఫైల్ కలెక్టర్ కు పంపేందుకు లంచం డిమాండ్
ఏసీబీ కి పట్టుబడ్డ జిల్లా ఉద్యాన పట్టుపరిశ్రమ అధికారి సూర్యనారాయణ .
ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ లో రూ 1లక్ష 14వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు ఓ అధికారి.
నోట్ల కట్టలు లేనిదే ఫైలు కదిలే పరిస్థితి లేదు.
కొందరు అధికారులు గుండెలు తీసిన బంటుల్లా తయారయ్యారు. కలెక్టర్ ఉండే కార్యాలయ ఆవరణలో లంచం తీసుకునేందుకు వెనుకాడటం లేదు. నోట్ల కట్టలు లేనిదే ఫైలు కదిలే పరిస్థితి లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.
ఇందుకు ఉదాహరణగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో హార్టికల్చర్, సెరికల్చర్ జిల్లా అధికారి కే.సూర్యనారాయణ పాల్వంచ,ములకలపల్లి, దమ్మపేట రైతులకు సంబంధించిన డ్రిప్ కు చెందిన
14 లక్షల 18 వేల బిల్లును సర్టి ఫై చేసి,కలెక్టర్ వద్దకు ఫైల్ పంపేందుకు లక్ష 14 వేల రూపాయలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి పట్టుపడ్డాడు.డ్రిప్ కంపెనీకి చెందిన వ్యక్తి వద్ద నుండి 1లక్ష 14వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సూర్యనారాయణ ను కలెక్టరేట్లో ఆయన కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.గతంలో ఇదే అధికారి మహబూబాబాద్ పనిచేశారు. సదరు కంపెనీ మహబూబాబాద్ జిల్లా లో రైతులకు సబ్సిడీ పై డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సరఫరా చేసింది.ఈ జిల్లా లో కూడా చేస్తోంది.రైతు చేలో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అమర్చిన తరువాత హార్టికల్చర్ అధికారులు ధృవీకరించాల్సి ఉంటుంది.ఇలా ధ్రువీకరించి ఆ ఫైలు కలెక్టర్ వద్దకు పంపేందుకు బిల్లులో రెండు శాతం కమిషన్ గా ఇవ్వాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు.
గతంలో మహబూబాబాద్ లో సైతం పనిచేసినప్పుడు బిల్లులో తన పర్సంటేజ్ ఇవ్వలేదని దానికి సంబంధించి 85వేలు,ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో పనికి 29వేలు మొత్తం ఒక లక్షా 14వేలు ఇస్తేనే ఫైల్ కలెక్టర్ పంపుతానని సూర్యనారాయణ ఖరాకండిగా చెప్పి, ఫైల్ తొక్కి పెట్టారు.
దీంతో సదరు కంపెనీ ఏసీబీని ఆశ్రయించింది. ఏసీబీ దాడి చేసి లంచం స్వీకరిస్తుండగా పట్టుకుంది. ఈ దాడిలో డి ఎస్పీ వై. రమేష్, సి ఐ లు శేఖర్, రామారావు, హెడ్ కానిస్టేబుల్ పుల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు. ఏసీబీ చురుకుగా ఉందని ఎవరు లంచం ఇవ్వొద్దని తమ టోల్ ఫ్రీ నెంబర్ 1064 ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు.
previous post

