ప్రచురణ.
తేదీ 10-01-2025
కొత్తగూడెం .
రాష్ట్ర ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ హమీలను అమలు చేయాలని,ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంచాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని… DYFI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హమీలో భాగంగా యువతకి యూత్ డిక్లరేషన్ పేరుతో 5 హమీలను ఇవ్వడం జరిగిందనీ వాటిని అమలు చేయాలి అని డీ వై ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లిక్కీ బాలరాజు, కాలంగి హరిక్రిష్ణ డిమాండ్ చేశారు
స్థానిక కొత్తగూడెం పట్టణ లో ఉన్న లైబ్రరీ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ
ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ,జాబ్ క్యాలెండర్ ద్వారా నియమకాలు చేపడతామని ,నిరుద్యోగ భృతి 4000 రూ,,లు ఇస్తామని,యూత్ కమిషన్ ఏర్పాటు చెస్తామని చెప్పింది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినది.కానీ ఇప్పటి వరకు యూత్ డిక్లరేషన్ హమీలను అమలు చేయలేదు.జాబ్ క్యాలెండర్ ప్రకటించారే తప్ప దాని ప్రకారం అమలు చేయడం లేదు.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ హమీలను అమలు చేయాలని,అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంచాలనే ప్రతిపాదన చేస్తుంది.దీంతో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రాకుండా తీవ్రమైన అన్యాయం జరుగుతది.గత 10 ఏండ్ల నుండి నిరుద్యోగ యువత ఉద్యోగాలకై ప్రీపేర్ అవుతున్నారు.కావున రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వ పదవి విరమణ వయస్సును పెంచాలనే ప్రతిపాదన ను ఉపసంహరించుకోవాలని,నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డివైఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటి గా డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు ..
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బి వీరభద్రం , జిల్లా నాయకు ఉగం కోటేశ్వరరావు , సుమన్, శ్రవణ్, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు .

