U9udayam.com | Telugu Local News App Latest News
ఆంధ్రప్రదేశ్

ఎవరిని పిచ్చోళ్లను చేయడానికి డిప్యూటీ సీఎం గారు..


మాజీ రాష్ట్ర విప్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు.
ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.
ఎవరిని పిచ్చోళ్లను చేయడానికి ఈ సవరణ పెడుతున్నారు డిప్యూటీ సీఎం గారి అంటూ భద్రాద్రి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ రాష్ట్ర విప్ రేగా కాంతారావు ఎద్దేవా చేశారు. అసలు గ్రామ సభలు ఎందుకు పెడుతారు? ఏదైనా పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి లిస్ట్ లో నుంచి అర్హులను ఎంపిక చేయడం కోసం పెడుతారు.
కేవలం దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పేర్లను చదివి వినిపించడానికి గ్రామ సభలు ఎందుకు? అధికారులంతా ఉర్లలోకి పోవడం ఎందుకు ? జనాల్ని ఆగం చేయడం ఎందుకు ? అప్లయ్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ గ్రామ పంచాయతీ వద్ద అతికిస్తే అయిపోతాది కదా
ఈ ఉత్త ముచ్చట్లతోటి ఇంకెన్ని రోజులు టైం పాస్ చేస్తారు
మీ డ్రామాలు జనాలకు అర్థమయ్యాయి కాబట్టే ఎక్కడిక్కడ తిరగబడుతున్నారు….. కాంగ్రెస్ కు తిరుగుబాటు మొదలైంది …
రేవంత్ వన్ని టైంపాస్ రాజకీయాలు తుపాకీ రాముని మాటలు తప్పాచేసింది ఏమిలేదు … ఒక్క ప్రాజెక్టు కట్టకుండా
సంవత్సరానికి రూ.1.40 లక్షానలపై వేల కోట్లు సుమారుగా అప్పు చేసి ప్రజాధనం వృదా చేసి ప్రజలతో ఆటాడుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు…
వీళ్లకు బుద్దిరావాలంటే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ కు కర్రుకాల్చి వాత పెట్టాలి అని ప్రజలకు విజ్ఞప్తిచేయుచున్నాను ….
మంత్రుల నియోజక వర్గాలలో గ్రామసభ సాక్షిగా రైతులు ఆత్మహత్యలు ఇంతకంటే ఏముంది దౌర్భాగ్యం ప్రజాపాలనపై నమ్మకముంటే 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యే లతో రాజీనామా చేపించి తిరిగి మళ్లీ గెలవాలని సవాల్ చేస్తున్నాను

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు:

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి..

రాష్ట్ర ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ హమీలను అమలు చేయాలని DYFI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ డిమాండ్…

Leave a Comment