గద్దర్ అవార్డు కు ఎంపికైన మల్లేశం సినిమా….
పద్మశాలి బిడ్డనైనందుకు గర్వపడుతున్న..
…చింతకింది మల్లేశం
ఉదయం/ హైదరాబాద్ /మే 30 : చేనేత బతుకులను కండ్లకు అద్దినట్టుగా చింతకింది మల్లేశం తన తల్లి ఆసుపోయడానికి పడుతున్న బాధను చూసి చెల్లించిపోయి ఏడు సంవత్సరాలు కఠోరమైన కష్టంతో ఆసు యంత్రాన్ని సృష్టించి గతంలో అబ్దుల్ కలాం అవార్డు , పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఎన్నో ఇన్నోవేషన్స్ లో పాల్గొని చేనేత రంగానికి సులభమైన పద్ధతిలో యంత్రాన్ని తయారుచేసి చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి చింతకింది మల్లేశం. శుక్రవారం ఈ సందర్భంగా చింతకింది మల్లేశం మాట్లాడుతూ తెలంగాణ గద్దర్ అవార్డుకు మల్లేశం సినిమాకు ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పద్మశాలి బిడ్డనైనందుకు పద్మశాలి కుల బాంధవుల చేనేత కష్టాలకు నేను సాయమైనందుకు గర్వపడుతున్నానని అన్నారు. మల్లేశం సినిమాకు దర్శకత్వం, నిర్మాత, కథ స్క్రీన్ ప్లే వహించిన రాజు రాచకొండకు , మరియు నటీ,నటిమనులు ప్రియదర్శి, అనన్యకు, మరియు సినిమా నిర్మాణంలో పనిచేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
previous post
next post

