U9udayam.com | Telugu Local News App Latest News
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణ

సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారానికై ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి

కొత్తగూడెం 3టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , జులై 08 ( ఉదయం న్యూస్ )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ కొత్తగూడెం 3టౌన్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం సందర్శించారు. ముందుగా కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ పుష్పగుచ్చం అందించి జిల్లా ఎస్పీ గారికి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే సిబ్బంది నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే సిబ్బంది యొక్క ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్ ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో వర్టికల్స్ వారీగా విధులు నిర్వర్తించే సిబ్బందిని ఒక్కొక్కరిగా వారి పనితీరు గురించి పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిత్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. డయల్ 100 కు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ తో పాటు అధికారులు మరియు సిబ్బంది మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, సీఐ శివ ప్రసాద్,ఎస్సైలు పురుషోత్తం, విజయ కుమారి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

అవకాశం ఇవ్వండి మీకు “సేవకుడిగా” పని చేస్తా..

వాహనదారుల ప్రాణాలతో చెలగాటం

కాసాని ఐలయ్య మృతి పట్ల సంతాపం

Leave a Comment