లీడ్ క్యాప్ మిషనరీ టెండర్ను రద్దు చేసిన అధికారులు.
ఉదయం/ హైదరాబాద్.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని నాయడమ్మ LIDCAP లేదర్ పరిశ్రమల మరియు వరంగల్ తదితర ప్రాంతాలలో ఉన్న కోట్లు విలువ చేసే లేదర్ మిషనరీలను జులై 4,5 తేదీలలో టెండర్ ప్రక్రియ ద్వారా అమ్మకము చేసేందుకు అధికారులు సిద్ధమైన నేపథ్యంలో టెండర్ ప్రక్రియను LID CAP MD ఇండ్రస్త్రి అధికారులు తక్షణమే నిలిపివేయాలి అంటూ తెలంగాణ మాదిగ చర్మకారుల రాష్ట్ర సంఘాల JAC కన్వీనర్ కూసపాటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఈనెల మూడవ తేదీన హైదరాబాద్ సచివాలయంలో చీప్ సెక్రెటరీ మరియు ఇండ్రస్త్రి అధికారులను కలిసి వినతిపత్రం అందించారు.
దీనిపై తక్షణమే స్పందించిన సచివాలయ అధికారులు టెండర్ ప్రక్రియను నిలిపివేశారు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కూసపాటి శ్రీనివాస్*
జులై 4,5 తేదీలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ ద్యారా LID CAP MD ప్రవేశపెట్టిన లేదర్ పరిశ్రమలు హైదరాబాద్ గచ్చిబౌలి నాయడమ్మ LID CAP లేదర్ పరిశ్రమలు మరియు వరంగల్ దేశాయిపేటలో ఉన్న లేదర్ పరిశ్రమల్లో కోట్లు విలువ చేసే పాత మిషనరీ సామాగ్రి టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని
తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వాణిజ్య పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు,
మాదిగ చర్మకారుల సంఘాల విజ్ఞప్తి మేరకు పెద్ద మనసుతో స్పందించి LID CAP లేదర్ పరిశ్రమల పాత మిషనరీ అమ్మకాల టెండర్ ప్రక్రియ రద్దు చేసిన సందర్భంగా కూసపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ, సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, SC కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రితం గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

