ఫైర్ సిబ్బందితో కలిసి అగ్ని ప్రమాదం అదుపు.
కొత్తగూడెం ట్రాఫిక్ SI గడ్డం ప్రవీణ్ కుమార్ చాకచక్యం.
అభినందించిన స్థానికులు.
ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.
ఆదివారంనాడు ఉదయం సుమారు 3 గంటల సమయంలో, కొత్తగూడెం పట్టణంలోని చిన్న బజార్లో గల దుర్గాభవాని సెల్‌ఫోన్, వాచ్ షాప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.
నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న కొత్తగూడెం ట్రాఫిక్ SI గడ్డం ప్రవీణ్ కుమార్ చాకచక్యంగా స్పందించి, వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. బ్లూకోట్ PCలను అప్రమత్తం చేశారు. తరువాత ఫైర్ సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. SI ప్రవీణ్ కుమార్ సమయస్ఫూర్తి వలన మంటలు పక్క దుకాణాలకు వ్యాపించకుండా నివారించబడ్డాయి.
ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు, అయితే ఆస్తి నష్టం జరిగింది.
కొత్తగూడెం ట్రాఫిక్ SI గడ్డం ప్రవీణ్ కుమార్ చాకచక్యమైన చర్యలను స్థానిక ప్రజలు మరియు వ్యాపారస్తులు అభినందించారు.
previous post
next post

