U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

పార్టీ నాయకులతో జిల్లా కలెక్టర్ సమావే శం.


Udayam/ bhadradri kothagudem
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం రెండవ సాధారణ ఎన్నికలు ( ఎంపీటీసీ/ జెడ్పిటిసి -2025) నిర్వహణలో భాగంగా, మండల ప్రజా పరిషత్ మరియు జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఓటర్ల జాబితా మరియు పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారాల కోసం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం తయారుచేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా మరియు పోలింగ్ స్టేషన్లో జాబితాను రాజకీయ పార్టీ నాయకులకు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 471 పంచాయతీలలో మొత్తం 6,69,048 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 3,25,045, మహిళలు 3,43,979 మంది కాగా 24 మంది ఇతరులు ఉన్నారని తెలిపారు.4168 వార్డులకు గాను 4242 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఓటు హక్కు కల్పించేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు చేసుకోవడం కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని, నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్త పేర్లు చేర్పులు ఉండబోవు అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ఓట్లు బదిలీ చేయడం సాధ్యం కాదని తెలిపారు. ఇప్పటివరకు గుర్తించిన పోలింగ్ కేంద్రాలు యధాతరంగా కొనసాగుతాయని, వాటిలో ఎటువంటి మార్పులు ఉండబోవని ఆయన అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డిప్యూటీ జెడ్పి సీఈవో చంద్రశేఖర్ , ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ బాల ప్రసాద్, భారతీయ రాష్ట్ర సమితి అనుదీప్, సిపిఐ ఎస్ శ్రీనివాస్, సిపిఎం ఏ సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ , నోముల రమేష్, ఆమ్ ఆద్మీ పార్టీ ఏ. రాంబాబు మరియు తదితరులు పాల్గొన్నారు

Related posts

కొత్తగూడెం డిఎస్పిని అభినందించిన డిజిపి..

పెద్దపల్లి ఇటుకబట్టీలపై లోకాయుక్త కొరడా

వాహనదారుల ప్రాణాలతో చెలగాటం

Leave a Comment