U9udayam.com | Telugu Local News App Latest News
క్రైమ్ వార్తలుతెలంగాణ

పేకాట స్థావరంగా మారిన జిల్లా కార్యాలయం

పనిదినాల్లో పేకాట ఆడుతున్న అటవీశాఖ అధికారులు

లక్ష్మీదేవి పల్లి, 10 సెప్టెంబర్ ( ఉదయం న్యూస్ )

అటవీశాఖ పరిరక్షణ బాధ్యతలు గాలికి వదిలేసి జిల్లా కార్యాలయంలోనే పేకాట ఆడుతున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో చోటుచేసుకుంది. లక్ష్మిదేవి పల్లి మండలంలో గల జిల్లా అటవీశాఖ కార్యాలయంలో జిల్లా అధికారులకు సంబంధించిన డ్రైవర్లు , ఫారెస్ట్ సిబ్బంది , ఉద్యోగులు పేకాట ఆడుతూ బుధవారం ఒక కెమెరాకు చిక్కడంతో మండలంలో చర్చనీయాంశంగా మారింది. మండలంలో కొంతమంది ఫారెస్ట్ అధికారుల తీరు సక్రమంగా లేదని జిల్లా అధికారిని కలిసి పిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులకు జిల్లా అటవీశాఖ కార్యాలయం పేకాట క్లబ్ ని తలపించేలా కనబడటంతో ఆశ్చర్యానికి గురైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. మండల పరిధిలో అక్రమ ఇసుక దందా చేస్తున్న వ్యక్తులతో కొంతమంది ఫారెస్ట్ ఉద్యోగుల హస్తం ఉన్నట్లు అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పిర్యాదు చేసేందుకు వచ్చిన వారికి పేకాట క్లబ్ కనబడటంతో జిల్లా అటవీశాఖ అధికారి తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. నిషేధిత పేకాట ఆటలను వ్యతిరేకించాల్సిన అధికారులే బరితెగించి జిల్లా కార్యాలయంలో పేకాట ఆడటం చూస్తుంటే జిల్లా అటవీశాఖ అధికారి పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని విమర్శించారు. మండల పోలీసు శాఖ అధికారులు పేకాట స్థావరాలపై నిఘా విభాగం దృష్టి సారించకపోవడంతో జూదంగాళ్ళు విచ్చలవిడి తనం ఎక్కువైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా అటవీశాఖ కార్యాలయాన్ని పేకాట క్లబ్ గా మార్చిన వ్యక్తులపై జిల్లా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

Related posts

సీనియారిటీతోనే జర్నలిస్టులకు ఇంటి స్థలాలు.

సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారానికై ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి

పాల్వంచ ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు..!

Leave a Comment