U9udayam.com | Telugu Local News App Latest News
ఉద్యోగాలుతెలంగాణ

కెటిపిఎస్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో 6వ స్థానంలో గెలుపొందిన సిద్దెల హుస్సేన్

పాల్వంచ , సెప్టెంబర్ 11 ( ఉదయం న్యూస్ )

పాల్వంచ కేటిపిఎస్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల ఫలితాలు గురువారం రాత్రి వెలువడ్డాయి. ఎంతో ఉత్కంఠగా కొనసాగిన క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో కళాకారుడుగా గుర్తింపు పొందిన సిద్దేల హుస్సేన్ 6 వ స్థానంలో జేయకేతనం ఎగురవేశారు. కేటిపిఎస్ క్రెడిట్ సొసైటీ జనరల్ విభాగంలో ఏడుగురు అభ్యర్థులు గెలిపిందినట్లు అధికారకంగా వెల్లడించారు. మొదటి స్థానంలో బి. మహేందర్ , రెండోవ స్థానంలో ధర్మరాజుల నాగేశ్వరరావు, మూడోవ స్థానంలో డోలి శ్రీనివాస్, నాలుగోవ స్థానంలో దానం నరసింహారావు, ఐదోవ స్థానంలో రఘు కృష్ణ, ఆరోవ స్థానంలో సిద్దెల హుస్సేన్ , ఏడోవ స్థానంలో సిద్ధి ప్రశాంత్ లు గెలుపొందినట్లు అధికారకంగా ప్రకటించారు. గెలుపొందిన అభ్యర్థుల ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. కళాకారుడుగా గుర్తింపు పొందిన సిద్దేల గెలుపు పట్ల పలువురు అభినందిస్తున్నారు.

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆలోచనలోనుంచి మరో మార్గదర్శకం: బయోచార్

కలెక్టరేట్ లో పట్టుబడ్డ అవినీతి అధికారి.

భారీగా నిషేదిత గంజాయిని పట్టుకున్న జిల్లా పోలీసులు

Leave a Comment