U9udayam.com | Telugu Local News App Latest News
క్రైమ్ వార్తలుతెలంగాణ

అనుమతి లేకుండా ఎగ్జిబిషన్ ఎలా నడుస్తుంది…?

గడువు తేదీ ముగిసినా ఇంకా ఎగ్జిబిషన్ ..

ప్రజల ప్రాణాలు గ్రామ పంచాయతీకి పట్టవా.

ఎగ్జిబిషన్ మేనేజ్మెంట్ తో కుమ్మక్కుయిన అధికారులు.

పంచాయతీ కార్యదర్శి తీరుతో నిబంధనల ఉల్లంఘన.

అధికారులకు తెలియకుండా కలెక్టర్ ఆదేశాలట.

ప్రమాదాలు జరిగితే బాధ్యత ఏ అధికారిది.

ఉదయం / భద్రాద్రి కొత్తగూడెం.

అనుమతి లేకుండా ఒక ఎగ్జిబిషన్ నడుస్తుందంటే అది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఒక వ్యాపార క్రీడ అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.
వివరాల్లోకి వెళితే
శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కళాశాల నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా నెలల తరబడి కొనసాగుతున్న స్థంబాద్రి ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ చుట్టూ వివాదం చెలరేగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవి పల్లి మండలం ప్రశాంత్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల శ్రీ రామచంద్ర ప్రభుత్వ కళాశాలలో కొనసాగుతున్న ఎగ్జిబిషన్ కు అనుమతి లేదంటే అతిశయోక్తి కాదు. సంబంధిత అధికారులు కేటాయించిన ఆదేశాల గడువు ముగిసినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ గ్రామీణ ప్రజలను నిలువు దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాలపరిమితి ముగిసి పది రోజులు అయినా గాని ఎగ్జిబిషన్ ఇంకా కొనసాగుతుండటం చూస్తుంటే సంబంధిత అధికారుల నిర్లక్ష్య వైఖరి కనబడుతుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గత నెల ఆగస్టు నుండి అక్టోబర్ 13 వరకు 50 రోజుల పాటు కొనసాగే ఎగ్జిబిషన్ ప్రదర్శన అనుమతులు తీసుకున్నా గాని గడువు తేదీ ముగిసినప్పటికీ నేటికీ ఎగ్జిబిషన్ కొనసాగుతుండడం చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎగ్జిబిషన్ ప్రదర్శన అనుమతులు ముగిసినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఎగ్జిబిషన్ కొనసాగుతున్న విషయమై ఉదయం తెలుగు దినపత్రిక బృందం స్థానిక గ్రామ పంచాయతీ అధికారిని వివరణ కోరడం జరిగింది. తనకి ఏమి తెలియదని ఎగ్జిబిషన్ అనుమతుల విషయం తమ కార్యాలయంలో అడగొద్దు అంటూ ఒక వింత సమాధానం ఇచ్చారు. ప్రజలను దోచుకుంటున్న ఎగ్జిబిషన్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రశ్నించిన వారికి గ్రామ పంచాయతీ పరిధిలో ఏమి జరిగిన తమకు సంబంధం లేకుండా ఉండటమే తమ విధులు అన్నట్లుగా సమాధానం రావడం సహజమే.

ఎగ్జిబిషన్ గడుపు పొడిగింపు విషయం తెలియదు..
పసుపులేటి కృష్ణ ( పంచాయతీ కార్యదర్శి)

స్థంబాద్రి ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులకు శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాల ప్రాంగణ స్థలం కేటాయింపు అనుమతి ఇచ్చిన ప్రిన్సిపాల్ లెటర్ పరంగా మాత్రమే తమ పంచాయతీ అనుమతులు ఇవ్వడం జరిగిందని లక్ష్మీదేవి పల్లి మండలం ప్రశాంతి నగర్ గ్రామపంచాయతీ కార్యదర్శి తెలిపారు.అన్ని శాఖల అనుమతులు సక్రమంగా ఉన్నందునే అక్టోబర్ నెల 13వ తేదీ వరకు అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు. అధికారులు కేటాయించిన గడువు తేదీ ముగిసినప్పటికీ ఎగ్జిబిషన్ మేనేజ్మెంట్ మరికొన్ని రోజులు ఎగ్జిబిషన్ కొనసాగించుట కొరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్లుగా ఎగ్జిబిషన్ నిర్వహణ కమిటీ మౌఖికంగా తెలిపిందని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి గాని డిపిఓ కార్యాలయం నుండి కానీ ఎగ్జిబిషన్ గడువు పొడిగిస్తున్నట్లు ఎటువంటి అనుమతులు తమ గ్రామ పంచాయతీకి రాలేదని పంచాయతీ కార్యదర్శి పసుపులేటి కృష్ణ తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అనుమతులు కేటాయించినట్లు ఆ ఆదేశాలు స్తంభాద్రి ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ వ్యాపార నిర్వహించే వారి వద్దనే ఉన్నాయని ఆ ఆదేశాల కాఫీలు అధికారకంగా తమ వద్దకు రాలేదని అన్నారు.

గ్రామీణ ప్రజల వద్ద లక్షల్లో నిలువు దోపిడీకి శ్రీకారం చుట్టిన గడువు పొడిగింపు*

స్తంభాద్రి ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ కాలం చెల్లినప్పటికీ ఎగ్జిబిషన్ కొనసాగేందుకు అనుమతులు ప్రత్యేకంగా పొడిగించబడటం చట్టపరంగా కూడా ప్రశ్నార్థకంగా మారింది. స్థానికుల సమాచారం మేరకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహణ మేనేజ్మెంట్‌ పై పంచాయతీ అధికారులు, కొందరు స్థానిక నాయకులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని తెలుపుతున్న నిర్వాహకుల వద్ద సంబంధిత అధికారుల ఆదేశాలు ఉన్నాయో లేదో పూర్తి స్థాయిలో తెలియాల్సిన అవసరం ఉన్నది. నవీన్ మిట్టల్ జీవో ఆధారంగా నెలలు తరబడి కాలేజీ ప్రాంగణం పూర్తి స్తాయిలో ఇప్పటికే కళాశాల ప్రిన్సిపాల్ ఇచ్చిన అనుమతులు వలన క్రీడాకారులు ఇంటికే పరిమితం అయినట్లు తెలుస్తుంది. చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు గాలికి వదిలేసి నిరంతరం కొనసాగే ప్రదర్శనలకు ఆదేశాలు ఇవ్వడం అనుమానాలకు తావిస్తుంది. కాలేజీ ప్రాంగణంలో కొనసాగుతున్న ఎగ్జిబిషన్ గడువు తేదీలు పెంచుకుంటూ ఇంకెన్ని నెలలు ఎగ్జిబిషన్ ప్రదర్శన కొనసాగిస్తారు. అనే విషయం పై వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

Related posts

సబ్ కమిటీలు చురుకుగా పని చేయాలి -మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి

వ్యాసరచనలో ఉత్తమ బహుమతులు అందుకున్న విద్యార్దినీలు విద్యార్థులు

ముఖ్యమంత్రి ఎదురుగా నిరసన తెలిపేందుకు ధైర్యం ఉండాలి.సాహసోపేత పోరాటంపై అభినందనల హర్షం

Leave a Comment