U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

గిరిజనుల గొంతులు తడిపినభగీరథుడు ఉదయ్ అన్న

గరిమెళ్ళ పాడు గిరిజనులకు ఇళ్లకు తాగునీరు
ఉదయ్ అన్న పోరాటపలితమే… హర్షిస్తున్న గిరిజనం

ఉదయం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 18
అక్క ఇతను ఎవరో మనకు సహాయం చేస్తాడట.. అండగా ఉంటాడట… ఇల్లు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాడట ఎందరో మహానుభావులు హామీలిచ్చి తప్పుకున్నారు. ఈ దొరొచ్చి మన పక్షాన నిలబడతారని పక్కున నవ్వారు.. ఇచ్చిన మాట తప్పలేదు ఆయనలో ఉన్న సంకల్పం సడలింపలేదు. చావు రేవో మీతోటే నేను అంటూ శపదం పూని సాధించిన సుదీర్ఘ చరితకు నిలువెత్తు సాక్ష్యాలు ఇవి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రశాంత్ నగర్ పంచాయతీలోని గరిమెల్లపాడు గిరిజనానికి అన్నీ తానే నిలిచాడు. ఆ అమాయకపు గిరిజనులకు నిలువ నీడ లేకపోవడంతో ఇళ్ల స్థలాల కోసం సుదీర్ఘ కాలం పాటు రాజీలేని పోరాటం చేశారు. ఆ గిరిజనులతో మమేకమై కష్టమో నష్టమో భరించాడు చివరకు అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. గరిమెలపాడు గిరిజనులకు ఇళ్ల స్థలాలు ఇప్పించుకునే కాకుండా ఆ ప్రాంతంలో వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో విజయం సాధించారు. ఇంటింటికి తాగునీరు ప్రత్యేక పైప్లైన్ ద్వారా కల్పించాడు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తండాల్లో తాగునీటి తండ్లాట నీటి కోసం బహుదూరపు బాటసారిలా కాలినడకన వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నేటికీ కనపడుతుంది. అలాంటి కష్టాలను తొలగించారు. ఇంటింటికి తాగునీరు రావడంతో గిరిజన మోమున చిరునవ్వు విరిసింది ఆ ఊరికి ఊతమిచ్చినట్లు ఉదయాన్నే చేసిన సేవలు తిరస్మరణీయంగా నిలిచిపోతాయని ప్రతి ఒక్క గిరిజనుడు ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

కొత్తగూడెం: జాతీయ లోక్ అదాలత్ కు అనూహ్య స్పందన

జిల్లా కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ చీకటి కార్తిక్ పై ఆరోపణలు అర్ధరహితం

మూడు రోజుల్లో మాడవీధుల కు సంబంధించి స్థల సేకరణ ప్రక్రియ పూర్తి చేస్తాం…

Leave a Comment