U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

తాత్కాలికమేనా..? కెసిఆర్ సార్.. చూడండి అధికారుల తీరు

తాత్కాలికమేనా..?
కెసిఆర్ సార్.. చూడండి అధికారుల తీరు

ఉదయం కొత్తగూడెం నవంబర్ 04

కొత్తగూడెం నియోజకవర్గంలో ఆదివారం నాడు బీ అర్ ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేస్తున్న సందర్భంగా అధికారులు కొత్తగూడెంలోని ప్రధాన రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేశారు. గుంతలు ఎవరికి కనిపించకుండా ఇలా తూతూ మంత్రంగా యాష్ పోసి చేతులు దులుపుకున్నారు. దీంతో వాహనదారులు దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కెసిఆర్ ప్రగతి మైదానంలో హెలికాప్టర్ ద్వారా చేరుకొని రోడ్డు మార్గాన కొత్తగూడెం ప్రకాశం స్టేడియం కు చేరుకుంటారు. అధికారులు మాత్రం ఏదో నామమాత్రంగా గుంతల్ని పూడ్చడం ఏంతనటూ వాహనాదార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం గుంతల్లో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడినప్పటికి ఎవరు పట్టించుకోలేదని, కెసిఆర్ వస్తున్నాడని ఇంత హడావుడి చేయడం అవసరమా అంటూ వాహనాదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన రహదారులలో సిమెంట్ గాని, డాంబర్ తో గాని పూడ్చితే బాగుంటుంది కానీ ఇలా తాత్కలికంగా పూడ్చడం వల్ల కేవలం బిల్లులు వస్తాయి తప్ప.. సమస్య మాత్రం పరిష్కారం కాదంటున్నారు వాహనాదారులు.

Related posts

దళిత కాలనీ పేదలకు శాశ్వత గృహవసతి కల్పించాలినిర్వాసితులైన పేదలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలిపెనుబల్లి వంతెనను తక్షనమే నిర్మించాలి

వాహనదారుల ప్రాణాలతో చెలగాటం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆలోచనలోనుంచి మరో మార్గదర్శకం: బయోచార్

Leave a Comment