ఉదయన్న గెలుపు కోసం “యువ సైన్యం” సిద్ధం
ఎన్నికల ప్రచారంలో ఉదయన్నకు తోడుగా..
జోరుగా హుషారుగా ప్రచారం ముమ్మరం
ఉదయం జిల్లా ప్రతినిధి నవంబర్ 7.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఆ ఆజాద్ అధికార సేన పార్టీ బలపరుస్తున్న ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి ఇమంది ఉదయ్ కుమార్ గెలుపు కోసం ఆయన ప్రత్యేక కార్య చరణ ప్రణాళికలతో రూపుదిద్దుకున్న యువ సైన్యం ఆయన వెన్నంటే ఉండి ప్రచారంలో ముమ్మరంగ దూసుకుపోతున్నారు. ఉదయ్ కుమార్ గెలుపే లక్ష్యంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారంలో అలుపెరగని సైనికుల్ల పనిచేస్తున్నారు. ప్రతిరోజు నియోజకవర్గంలో వాడవాడలా తిరుగుతూ వినూత్న ప్రచారాన్ని చేపట్టి ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. నిస్వార్థ సేవకుడు అన్ని వర్గాల ప్రజలకు సన్నిహితుడైన ఉదయన్నకి మీ అమూల్యమైన ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం లోని ప్రశాంతినగర్ పంచాయతీ పరిధిలోని గరిమెళ్ళ పాడు గిరిజనం కోసం అన్ని తానే నిలిచి విద్యా ఉపాధి సౌకర్యాలను కల్పి వారు జీవించేందుకు నిలువ నీడను సాధించేందుకు అకుంఠితమైన దీక్షతో అలుపెరుగని పోరాటం చేసిన క్రమంలో ఆ గిరిజనులతో పాటు తాను ఒక సైన్యాధిపతిగా పనిచేసి ఆ గిరిజన కోసం తన అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ఉదయాన్నే కోసం మేము సైతం అంటూ ఎన్నికల ప్రచారంలో గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆ గిరిజనులు చేస్తున్న ప్రచారానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములై వారి అమూల్యమైన ఓటు వేసి రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలికి ఉదయాన్నే అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు అందరూ సహకరించాలని వేడుకుంటున్నారు. వీరు చేస్తున్న ఎన్నికల ప్రచారం ఉదయన్నను గెలుపు బాటలో పయనించాలని అందరం ఆ ఆశిద్దాం ఆశీర్వదిద్దాం

