అవకాశం ఇవ్వండి మీకు “సేవకుడిగా” పని చేస్తా
ఎన్నికల ప్రచారంలో దుమ్మురేపుతున్న…
కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి ఇమంది ఉదయ్ కుమార్
ఉదయం జిల్లా ప్రతినిది నవంబర్ 13..
నూతన రాజకీయాల్లో సరికొత్త మార్పునుకోరుకుంటూ ప్రలోభాలకు లొంగకుండా మీ సేవకుడిగా పని చేస్తా జరుగుతున్న ఎన్నికల్లో ఒక అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించండి.. కొత్తగూడెం నియోజకవర్గంలో మార్పును తీసుకురావడం తధ్యమని కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి ఇమంది ఉదయ్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని స్థానిక రైతు బజార్ ప్రాంతంలో తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతి ఒక్క ఓటర్ ని కలుసుకొని ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వండి స్థానికుడిగా సమస్యలపై సాధకుడిగా సేవకుడిగా మీకు పని చేస్తానని ఆజాద్ అధికార సేన పార్టీ బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. కొత్తగూడెం నియోజకవర్గం రూ 3 వేల కోట్లు ఖర్చుపెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ప్రగల్బాలు పలుకుతున్న నేటి పాలకులకు కొత్తగూడెంలోని రైతు బజార్ దుస్థితి చూస్తేనే పాలకులు చేసిన అభివృద్ధి ఏంటో కళ్లకు కట్టినట్టు కనపడుతుందని ఆరోపించారు. లక్షలాది రూపాయలను వెచ్చించి రైతు బజార్ వర్తకుల కోసం నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ లు మందుబాబులకు అడ్డాగా మారి చివరకు పక్షులకు నిలయంగా మారాయని ఆరుకాలం కష్టించి పండించే పంటను పరదాల చాటున అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఎన్నికల నాడే వచ్చి ప్రజలు అనేక రకాలుగా మభ్యపెట్టి డబ్బు సంచులు గుమ్మరించి మసి బూసి మారేడు కాయను చేసినట్లు నక్క వినయాలు నాకు తెలియని స్థానికుడిగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి నీమధ్య ఉంటూ అనేక సమస్యలను పరిష్కరించడంలో ఎంతో కృషి చేశానని అన్నారు. ఓటరు దేవుళ్ళు ఒక్కసారి ఆలోచించి పనిచేసే యువనాయకత్వాన్ని ఎంచుకోవాలని మీరిచ్చే అమూల్యమైన ఓటుతో స్వార్థపూరిత రాజకీయ నాయకులకు చెంపపెట్టు కావాలని పిలుపునిచ్చారు . తాను కొత్తగూడెం వాసిగా ఆర్టీసీ కార్మికుడు బిడ్డగా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతు ఇచ్చి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట ఆయన సతీమణి కృష్ణవేణి, సీనియర్ పాత్రికేయులు సీమకుర్తి రామకృష్ణ, దశరథ్ రజువ, ఇమంది గణేష్, అంగిరేకుల రేవంత్ , పాయం తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

