U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

అభివృద్ధి అంటే ఇదేనా..?

అభివృద్ధి అంటే ఇదేనా..?

ఐదేళ్లు గడుస్తున్న అతి గతి లేని చేపల మార్కెట్

ఉదయం, కొత్తగూడెం నవంబర్ 18

2018లో అప్పటి మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనుల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం వారపు సంతలో చేపల మార్కెట్ కోసము శంకుస్థాపన చేసి ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ అది నేటి వరకు పూర్తి కాకపోవడంతో ప్రజా ప్రతినిధుల తీరును శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి. దీంతో కొత్తగూడెం- విజయవాడ జాతీయ రహదారిపైనే చేపలను విక్రయిస్తున్నారు..
ఆదివారము వచ్చిందంటే చాలు వారపు సంతలో చిరు వ్యాపారులతో కిక్కిరిసిపోతుంది. దీంతో చేసేది ఏమీ లేక చేపల వ్యాపారులు జాతీయ రహదారిపైనే చేపలను విక్రయించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతుంది..
ఐదేళ్లు గడుస్తున్న పునాదులకే పరిమితమైన చేపల షెడ్డు
శంకుస్థాపన చేసి ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ చేపల మార్కెట్ నిర్మాణానికి నోచుకోలేదంటూ చేపల వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇదెక్కడ అభివృద్ధి అంటూ ప్రజా ప్రతినిధుల పై మండిపడుతున్నారు.. రోడ్డుమీద వ్యాపారం చేయడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నారని వారు ఆపోతున్నారు..

Related posts

అనుమతి లేకుండా ఎగ్జిబిషన్ ఎలా నడుస్తుంది…?

గద్దర్ అవార్డు కు ఎంపికైన మల్లేశం సినిమా….పద్మశాలి బిడ్డనైనందుకు గర్వపడుతున్న..…చింతకింది మల్లేశం

భద్రాద్రి కొత్తగూడెం ప్రెస్ క్లబ్ నిర్వహణ కమిటీ ఏర్పాటు

Leave a Comment