U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

మిచౌంగ్ తుఫాను ప్రభావం వల్ల జిల్లాలో పలు చోట్ల చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

మిచౌంగ్ తుఫాను ప్రభావం వల్ల జిల్లాలో పలు చోట్ల చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

ఉదయం, కొత్తగూడెం డిసెంబర్ 06

మిచౌంగ్ తుఫాను ప్రభావం వల్ల జిల్లాలో పలు చోట్ల చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు.
భారీ వర్ష సూచన దృష్ట్యా జిల్లా రెడ్ అలర్ట్ లో ఉందని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకతించామని చెప్పారు. పొంగి పొర్లుతున్న వాగులు, అలుగులు దాటే అవకాశం లేకుండా భారీ కేడింగ్ గా ట్రాక్టర్లు అడ్డు పెట్టాలని చెప్పారు. మండలస్థాయి యంత్రాంగం పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. పొంగుతున్న వాగులు, చెరువు అలుగులు వీక్షించేందుకు ఎవ్వరిని అనుమతించొద్దని నియంత్రణ చేయాలని చెప్పారు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినందున హాస్టళ్లు, ఇండ్లలో ఉండే విద్యార్థులు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సరదాల కొరకు పొంగుతున్న వాగులు, అలుగులు దాటే ప్రయత్నం చేస్తుంటారని దాని వల్ల ప్రమాదం పొంచి ఉన్నట్లు చెప్పారు. సహాయానికి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో 08744241950, కొత్తగూడెం ఆర్డిఓ కార్యాలయంలో 9392919750, భద్రాచలం 08743232444 కంట్రోల్ రూములకు ఫోన్ చేయాలని చెప్పారు. పశువులను మేతకు బయటికి మేతకు వదలకుండా ఇంటి పట్టునే ఉంచాలని చెప్పారు. పనులకు వెళ్లే కూలీలు వర్షాలు తగ్గే వరకు ఇంటి పట్టునే ఉండాలని చెప్పారు.

Related posts

శభాష్ రమణారెడ్డి..

కిన్నెరసాని నీటి పథకం.. లీకేజీలే అధికం..

అవకాశం ఇవ్వండి మీకు “సేవకుడిగా” పని చేస్తా..

Leave a Comment