U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

సీనియారిటీతోనే జర్నలిస్టులకు ఇంటి స్థలాలు.

హర్షం వ్యక్తం చేసిన సీనియర్ జర్నలిస్టులు.
డబ్బులు వసూలు చేసిన సంస్థలు బేజారు.
నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు.
……..మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఉదయం/ వరంగల్.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ఎంపిక పంపిణీ విషయాలపై మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వివరాల్లోకి వెళితే హన్మకొండలోజరిగిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాలపై ఇప్పటికే కీలక విషయాలపై చర్చించామని మీడియా పెద్దలతో కలిసి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సీనియారిటీ ప్రాతిపదికన మాత్రమే ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్ల స్థలాల ఎంపిక ఉంటుందని మీడియా మిత్రులు సహకరించాలని కోరారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నేపథ్యంలో హైదరాబాదులో జర్నలిస్టులకు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇంటి స్థలములకు సంబంధించిన సమస్యను పూర్తిచేసే అందజేశామని అన్నారు.
వరంగల్ కు సంబంధించిన పెండింగ్ జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యను సైతం త్వరలోనే క్లియర్ చేస్తామని అన్నారు. జర్నలిస్టులకు ఎంత స్థలం కేటాయించాలని విషయంలో ఎక్కువ తక్కువలు కాకుండా అటు ప్రభుత్వానికి ఇటు మీడియా చైర్మన్ శ్రీనివాసరెడ్డికి క్లారిటీ ఉందని తెలిపారు.
సొసైటీల ద్వారా గాని లేదా నేరుగా గాని ఒక సరైన పద్ధతిలో కేటాయింపులు ఉంటాయని అన్నారు. అంతే తప్ప నిన్న మొన్న వచ్చిన వారికి కాకుండా కార్డులు ఉన్నవాళ్లు అది కూడా లోతుగా పరిశీలించి నిర్ణయాలు జరుగుతాయని అన్నారు.
హడావుడిగా ఎవరికి పడితే వాళ్లకి ఇచ్చే ప్రసక్తి ఉండదని తేల్చి చెప్పారు. అలా చేయడం వల్ల మీడియాలో ఉన్న సీనియర్లకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కుప్పలు తెప్పలుగా ఉంటూ నేను మీడియా అనే వాళ్లకు తావుండదని అన్నారు. అధ్యయనం అనంతరం మాత్రమే తుది జాబితాలను రూపొందించి అందిన జాబితాలలో మొదటి దశలో ఇళ్ల స్థలాల కేటాయింపులు ఉంటాయని తెలిపారు. దీంతో ఇప్పటికే ఇళ్ల స్థలాలు వస్తాయని ఆశతో లక్షల రూపాయలు వసూలు చేసిన ఈ యాజమాన్యాలకు గొంతులో వెలక్కాయ పడ్డట్లు అవుతుంది. ఏది ఏమైనా సీనియారిటీ ప్రకారం ఇవ్వాలనే ఆలోచన చాలా బాగుందని పాత్రికేయ సోదర వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Related posts

జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై జనవరి 15తర్వాత ఉన్నతస్థాయి సమావేశం-ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి మంత్రి పొంగులేటి హామీ

గణేషుడికి వీడ్కోలు పలికిన ఇమంది ఉదయ్ కుమార్.

కూకట్‌పల్లిలో సెలూన్ యజమాని దారుణ హత్య.. షాపులోనే కిరాతకంగా చంపేసిన దుండగులు

Leave a Comment