నియామక ఉత్తర్వులు అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
కొత్తగూడెం టౌన్ (భద్రాది కొత్తగూడెం జిల్లా): జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) నేషనల్ చైర్మన్ స్వప్న ఎం ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా జిల్లా కేంద్రానికి చెందిన మారెళ్ళ విజయకుమార్ ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య నియామక ఉత్తర్వులు జారీ చేసి నేషనల్ కన్వీనర్ ఆర్కే ప్రసాద్ చేతుల మీదుగా అందించారు. గతంలో జిల్లా ఇన్చార్జిగా పనిచేసిన విజయ్ కుమార్ సేవలను దృష్టిలో ఉంచుకొని జిల్లా అధ్యక్షులుగా, సామాజిక ఉద్యమకారుడు విద్యావంతుడైన భానుప్రకాష్ ను ప్రధాన కార్యదర్శిగా నియమించామని తెలిపారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షులు మారేల్లి విజయకుమార్ మాట్లాడుతూ తనపై వచ్చిన నమ్మకంతో తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం నిజాయితీగా నిస్వార్ధంగా చేస్తానని అన్నారు. తనకు ఈ పదవి రావడానికి కృషిచేసిన జాతీయ, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గూడూరు మాంచాలక్కా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గోరపూడి భాస్కరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు, సీనియర్ న్యాయవాది మాదాసు మొగిలయ్య, పాక శ్రీనివాస్ యాదవ్, ఎండి సర్వర్ అహ్మద్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఉచత శ్రీకాంత్, వరంగల్ జిల్లా అధ్యక్షులు నల్ల రవికిరణ్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు రామారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు పెనుబల్లి వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, రాధాకృష్ణ, ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు జయగుణ, ప్రధాన కార్యదర్శి గొడ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

