U9udayam.com | Telugu Local News App Latest News
క్రైమ్ వార్తలుతెలంగాణరాజకీయంవాతావరణంవైద్యం ఆరోగ్యం

వాహనదారుల ప్రాణాలతో చెలగాటం

జాతీయ రహదారి డివైడర్ ను ధ్వంసం చేసిన పెట్రోల్ బంక్ యజమాని

వేడుక చూస్తున్న ఆర్ అండ్ బి శాఖ అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జనవరి 09 ( ఉదయం )

వ్యాపార లాబ్ధ్ది కొరకు ఏకంగా జాతీయ రహదారి డివైడర్ ను తొలగించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డ్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన జాతీయ రహదారి రోడ్డు డివైడర్ ను తొలగించడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వాహనదారుల ప్రాణాలు పోతే నాకేంది అన్నట్లుగా స్వార్ధ బుద్ధితో లాభాల కొరకు వ్యాపారం మరింతగా పెంచాలని పెట్రోల్ బంక్ యజమాని తన బంక్ కి రాకపోకలకు అనుకూలంగా ఉండేవిధంగా రోడ్డు డివైడర్ ను ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారిపై ప్రమాదకరపు ప్రదేశాల్లో రోడ్డు సైడ్ వాహనాలు నిలుపుతే తక్షణమే చర్యలు తీసుకునే అధికారులకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే విధంగా రహదారి రోడ్డు డివైడర్ ను పెట్రోల్ బంక్ యజమాని తొలగించినప్పటికి రహదారులు మరియు భవనాల శాఖ అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రోడ్డు డివైడర్ తొలగింపు వలన ప్రమాదాలు చోటు చేసుకుంటే బాధ్యత ఎవరు వహిస్తారని స్థానిక ప్రజలు మండిపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాతీయ రహదారిపై రోడ్డు డివైడర్ ను తొలగించిన పెట్రోల్ బంక్ యజమాని పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచిచూద్దాం.

Related posts

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..

నడిరోడ్డుపై ప్రచారం కోసం పోలీస్ బాక్సులు..

మూడు రోజుల్లో మాడవీధుల కు సంబంధించి స్థల సేకరణ ప్రక్రియ పూర్తి చేస్తాం…

Leave a Comment