కొత్తగూడెం లీగల్ :: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు భవన ప్రాంగణంలో ముగ్గుల పోటీలు ఎంతో ఉత్సాహంగా జరిగినది. మహిళా న్యాయవాదులు,న్యాయ శాఖ మహిళా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని సంక్రాంతి కోలహాలాన్ని వారం రోజుల ముందే ప్రతిబింబించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టులో ముగ్గుల పోటీల విజేతలను ప్రకటించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ జిల్లా లీగల్ సర్వీసెస్ ఆధారిటీ సెక్రటరీ గొల్లపూడి భానుమతి, న్యాయమూర్తులు బత్తుల రామారావు, ఏ.సుచరిత, కే సాయి శ్రీ, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు, దూదిపాల రవికుమార్, ఎస్ ప్రవీణ్ కుమార్, అత్తలూరి మనోరమ, జీకే అన్నపూర్ణ, ఎస్. భానుప్రియ,మీనా కుమారి, సీనియర్,జూనియర్ కోర్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
previous post
next post

