భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఎస్పీ కార్యాలయం
తెప్పోత్సవం మరియు వైకుంఠ ద్వార దర్శన మహోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భాద్యతగా విధులు నిర్వర్తించాలి.
సెక్టార్ల వారీగా కేటాయించిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
ఈ నెల 9,10వ తారీఖులలో జరగనున్న తెప్పోత్సవం మరియు వైకుంఠ ద్వారదర్శన ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.ఈ రోజు భద్రాచలంలోని ఏఎస్పీ కార్యాలయం నందు గల కాన్ఫరెన్స్ హాలులో సెక్టార్ల వారీగా కేటాయించబడిన అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు చేయడం జరిగింది.అత్యంత వైభవంగా జరగనున్న తెప్పోత్సవం,ఉత్తర ద్వార దర్శన ప్రదేశాలలో విధులు నిర్వర్తించే అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.1300 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు మరియు ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ రెండు రోజుల పాటు భద్రాచలం పట్టణంలో జరిగే ఉత్సవాలకు పోలీసు వారు సందర్భానుసారంగా విధించే ఆంక్షలకు ప్రజలు సహకరించాలని కోరారు.

