U9udayam.com | Telugu Local News App Latest News
ఉద్యోగాలుజాతీయ వార్తలుతెలంగాణరాజకీయం

గూడెంలో విమానాశ్రయానికి సర్వం సిద్ధం

• కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు కేంద్ర బృందం రాక
• 20న విమానాశ్రయ ఏర్పాటు స్థల పరిశీలన
• కొత్తగూడెంలోని పలు ప్రాంతాలలో పర్యటన
• బృందం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
• విమానాశ్రయం ఏర్పాటుతో యువతకు ఉద్యోగాలు
• మారనున్న జిల్లా రూపురేఖలు
• రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల వెల్లడి

కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు తద్యమని, ఈనెల 20న కొత్తగూడెంలోని పలు మండలాలలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందాలు పర్యటిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ గౌరవ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారిని కలిసి కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిర్మాణానికి సంబంధించి గతంలో సూచించిన కొత్తగూడెం పరిసర ప్రాంతంలో భూములు అనుకూలంగా లేవని అనుమతి నిరాకరించగా, కొత్తగూడెం పరిధిలోని కొత్తగూడం, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలలో పలు భూములను గుర్తించామని, అక్కడ సర్వే నిర్వహించాలని ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి లేఖ రాశారు. ఆ లేఖకు కేంద్ర మంత్రి బదులిస్తూ, ఎయిర్ పోర్టు నిర్మాణానికి సాధ్యసాధ్యాల పరిశీలనకు ప్రత్యేక బృందం రావాల్సి ఉంటుందని, అందుకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని లేఖలో పేర్కొన్నారు. దీనికి స్పందించిన మంత్రి తుమ్మల, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని, రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని స్వయంగా కలిసి అంశాన్ని వారికి వివరించారు. తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి అందుకు అవసరమయ్యే నిధుల విడుదలకు ప్రత్యేక జీవో విడుదల చేశారు. దీంతో నిధులు మంజూరయ్యాయి. ఈ అంశాన్ని మంత్రి తుమ్మల కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారికి లేఖలో వివరించారు. అలాగే త్వరితగతిన సర్వే నిర్వహించేల ఆదేశాలు జారీ చేయాలని కోరారు. జిల్లాలో అనువైన స్థలంకోసం సర్వే నిర్వహించేందుకు పలు ప్రాంతాలను గుర్తించామని ఆ భూముల సాధ్యాసాధ్యాలు నిర్ధారించేలా చొరవ చూపాలని కోరారు. 


20న ప్రత్యేక బృందం జిల్లాలో పర్యటన…

మంత్రి తుమ్మల విజ్ఞప్తి మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనకు ప్రత్యేక బృందం వస్తున్నట్లు వెల్లడించారు. ఈ బృందం పర్యటనకు కావలసిన అన్ని ఏర్పాట్లు చూడాలని జిల్లా కలెక్టర్ ని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగూడెం పరిసరాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే జిల్లా రూపు రేఖలు మారనున్నాయన్నారు. ఇప్పటికే కొత్తగూడెం పాల్వంచ కలిపి కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

విమానాశ్రయం తో రూపురేఖలు మారనున్న కొత్తగూడెం…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. విమానాశ్రయం ఏర్పాటుతో కొత్తగూడెం జిల్లా రూపు రేఖలు మారుతాయన్నారు. వేలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. వాణిజ్యపరంగా, పర్యాటకపరంగా, పారిశ్రామికపరంగా అభివృద్ధికి విమానాశ్రయం ఎంతో దోహదం చేస్తుందన్నారు. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం, సింగరేణి గనులకు పేరుగాంచిన కొత్తగూడం మరియు అశ్వాపురంలో భారజల పరిశ్రమకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు సైతం వచ్చేందుకు ఈ విమానాశ్రయం ఎంతగానో దోహదపడుతుందన్నారు.

సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు…

విమానాశ్రయం ఏర్పాటు కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రహదారులు, భవనాల శాఖ మంత్రి గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారి సహకారం మరవలేనిదన్నారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేశారని, ఎయిర్ పోర్టుకు కావలసిన భూములను గుర్తించేందుకు సహాయ సహకారాలు అందించారన్నారు. అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Related posts

గిరిజనుల గొంతులు తడిపినభగీరథుడు ఉదయ్ అన్న

జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి– సిపిఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా.

పేకాట స్థావరంగా మారిన జిల్లా కార్యాలయం

Leave a Comment