భవ్యశ్రీ ని అభినందించిన జిల్లా కలెక్టర్ జితిష్ పాటిల్
15 వజాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వకృత్య , డ్రాయింగ్ , వ్యాసరచన పోటీలలో భాగంగా ప్రతిభను కనబరిచిన విద్యార్థిని విద్యార్థులుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితిష్ పాటిల్ శనివారం బహుమతులు అందజేశారు. అందులో భాగంగా భద్రాచలం కొర్రాజుల గుట్ట నన్నపనేని పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థిని కంచర్లపల్లి భవ్యశ్రీ కి జిల్లా కలెక్టర్ చేతులమీదుగా అవార్డ్ అందించారు. ఓటు హక్కు ను వినియోగించుకోవాలని వ్యాసరచనలో జిల్లా స్థాయిలో గుర్తింపును దక్కించుకుంది. పౌరులు అందరూ నిష్పక్షపాతంగా ఎన్నికల్లో ఓటు వెయ్యలని మతం , జాతి , కులం , వర్గం , బాషా బేధాలు లేకుండా ఎటువంటి వత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు హక్కు వలన ఉపయోగాలు తెలుపుతూ ప్రధమ బహుమతికి ఎన్నికైంది. నన్నపనేని పాఠశాల ఉపాధ్యాయులు బి. కృష్ణ , స్వర్ణాంజలి లతో పాటు సహచర ఉపాధ్యాయులు సహకరించారని విద్యార్థి భవ్యశ్రీ తెలిపింది. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చేతులమీదుగా బహుమతి అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

