U9udayam.com | Telugu Local News App Latest News
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణరాజకీయం

సెక్రటేరియట్ లో చందు అనే దొంగ..

ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు..
ఏళ్ల తరబడి మోసం చేస్తూ కాలయాపన..
రాకుంటే డబ్బు వాపస్ అంటూ మాయమాటలు.
సహకరిస్తున్న అధికారులు ఎవరు…

ఉదయం /హైదరాబాద్.

ఉద్యోగాలు పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న ఘనుడు సెక్రటేరియట్ లో ఉన్నాడంటే అతిశయోక్తి కాదు వివరాల్లోకి వెళితే..
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయ మాటలు చెప్పి లక్షలాది రూపాయలు దండుకుంటున్నాడు ముఠా నాయకుడు చందు అలియాస్ పున్నం చందు. ఇతగాడు సాక్షాత్తు సెక్రటేరియట్ లోనే ఉంటూ అధికారుల కనుసన్నల్లోనే ఉన్నట్లుగా నటిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడమే లక్ష్యంగా అధికారులతో మాట్లాడిస్తూ ఈరోజు రేపు అంటూ కాలం వెళ్లదీయడం అడ్వాన్స్ అని చెప్పి ముందే కుదుర్చుకున్న ఒప్పందంలో సగం తీసుకొని కాలం గడుపుతూ ఉంటాడు. ఈరోజు పని అవుతుంది రేపు పని అవుతుంది ఆ సర్టిఫికెట్ కావాలి ఈ సర్టిఫికెట్ కావాలి అంటూ నమ్మబలుకుతాడు. అనంతరం ఒక వారం పది రోజులు నెల ఆరు నెలలు సంవత్సరం అంటూ అడ్వాన్సు డబ్బులతో ఎంజాయ్ చేయడం ఈ పున్నం చందుకు వెన్నతో పెట్టిన విద్య. ఇతడు రాష్ట్రంలో కొంతమందిని టార్గెట్ గా చేసుకొని వారి ద్వారా నిరుద్యోగులను సెలెక్ట్ చేసుకుని గతంలో ఉద్యోగాలు ఇప్పించిన వారు పలుచోట్ల పలు శాఖలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారని నమ్మిస్తాడు లేదంటే వారితో మాట్లాడించి మరీ చెప్పిస్తాడు.. అది నమ్మిన నిరుద్యోగులు లక్షలాది రూపాయలను ఇచ్చి మరీ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉంటారు.. ఈ మాయగాడు ఉద్యోగం వచ్చేవరకు చెక్కులు ప్రామిసరీ నోట్లతో నమ్మించి వారికి ముందుగానే చెక్కులను అందజేస్తాడు. కానీ ఆ ఎకౌంటు పని చేస్తుందో లేదో అందులో ఎమౌంటు ఉందో లేదో కూడా ఆ దేవుడికి తెలియాలి. అతగాడి మాయలో పడి ఇప్పటికే లక్షలాది రూపాయలను పోగొట్టుకోవడం జరిగింది. ఈ మాయగాడు పున్నం చందు ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించానని అధికారులందరూ సహకరిస్తున్నారని మాయ మాటలు చెబుతూ సెక్రటేరియట్ లోనే ఉంటున్నాడంటే సెక్రటేరియట్ లోని పలు శాఖల అధికారులు సైతం ఈ మోసంలో పాలుపంచుకున్నట్లుగా తెలుస్తోంది… ఇప్పటికైనా ఈ పున్నం చందు విషయంలో సెక్రటేరియట్లో సరైన విచారణ నిర్వహిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.. త్వరలో ఈ మోసగాడు పున్నం చందు పూర్తి వివరాలు మరియు అధికారుల వివరాలు వారి నెంబర్లతో సహా మీ ముందుంచుతాం..

Related posts

మహిళా నాయకురాలు మంజులకు ఆర్థిక సాయం.

శభాష్ రమణారెడ్డి..

గణేషుడికి వీడ్కోలు పలికిన ఇమంది ఉదయ్ కుమార్.

Leave a Comment