U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

మహా న్యూస్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన ఇమంది ఉదయ్ కుమార్

కొత్తగూడెం , జూన్ 28 ( ఉదయం న్యూస్ )

హైదరాబాద్ లో మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయం పై జరిగిన దాడిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టియుడబ్ల్యూజే (ఐ.జె.యూ) యూనియన్ అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేత కె.టి.ఆర్ పై వచ్చిన కథనాలతో ఆ పార్టీ శ్రేణులు మీడియా కార్యాలయం పై ఈ విధంగా దాడులకు పాలపడటం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రిక స్వేచ్చకు భంగం కల్పించడం హేయమైన చర్య అంటూ పేర్కొన్నారు. మీడియా కార్యాలయం పై దాడులకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దుండగుల దాడిలో గాయపడిన మహా న్యూస్ ఛానల్ సిబ్బందికి సంఘీభావం తెలిపారు.

Related posts

నాకాబంది …

ప్రజాక్షేత్రంలోకి “నేనొస్తున్న”

రెడ్ అలర్ట్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:

Leave a Comment