U9udayam.com | Telugu Local News App Latest News
క్రైమ్ వార్తలుతెలంగాణ

చెట్టు కొమ్మతో ప్రమాదాన్ని అడ్డుకునే ప్రయత్నం

నవబరత్ ఇండస్ట్రీ యాజమాన్యంకి పట్టదు – పాల్వంచ మున్సిపాలిటీ అధికారులకు గిట్టదు

పాల్వంచ , జులై 04 ( ఉదయం న్యూస్ )

రోడ్డు మధ్య మార్గంలో పెద్ద గుంత ఏర్పడటంతో వాహనదారుల ఇబ్బందులు నవభారత్ ఇండస్ట్రీ యాజమాన్యంకి , పాల్వంచ మున్సిపాలిటీ అధికారులకు పట్టడం లేదని విమర్శలు వచ్చిపడుతున్నాయి. రోడ్డుపై ఉన్న గుంత చిన్నదే అయినప్పటికీ దానివలన సంభవించే ప్రమాదం పెద్దది అంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు ఏర్పడటంతో రోడ్డుపై ఏర్పడిన గుంత వాహనదారులకు కనబడదు అనే ఉద్దేశ్యంతో ఎవరో మహానుభావుడు చెట్టు కొమ్మతో ప్రమాదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఘటన పాల్వంచ మండలం నవభారత్ ఇండస్ట్రీ మీదుగా జగ్గుతండా గ్రామానికి అనుకోని కొత్తగూడెం బైపాస్ వెళ్లే రోడ్డు మార్గంలో చోటుచేసుకుంది. వర్షాలు కురుస్తున్న కారణంగా గుంతల్లో వర్షపు నీరు చేరి ప్రమాదాలకు గురైయ్యేందుకు అవకాశాలు ఉండటంతో ప్రాణ నష్టం కూడా వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నవభారత్ యాజమాన్యం ఇండస్ట్రీ పరిధిలో గల ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలను పూడ్చి ప్రయాణికులను ప్రమాదం బారిన పడకుండా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

Related posts

నడిరోడ్డుపై ప్రచారం కోసం పోలీస్ బాక్సులు..

డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ట్రాఫిక్ ఎస్ఐ నరేష్

Leave a Comment