నెలవారి మందులకోసం చేయూత.
ఫౌండేషన్ ద్వారా సాయం అందించిన రేగా కాంతారావు.
ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.
ఉద్యమ నాయకురాలు మంజులకు ఆరోగ్యం సరిగా లేక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారని తెలిసిన నేపథ్యంలో రేగా విష్ణు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు మాజీ ప్రభుత్వ విప్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు. చాలా కాలంగా ఆరోగ్య పరిస్థితి సరిగా లేక మహిళా ఉద్యమ నాయకురాలు ఆర్థికంగాను ఇబ్బందులు పడుతుంది. ఆమె భర్త కొండ జంపన్న సైతం ఉద్యమాల్లో పాల్గొని ప్రస్తుతం జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. జర్నలిస్టు జీవితం అంటే అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో భార్య మంజులకు అంతుచిక్కని ఆరోగ్య ఇబ్బందితో కుటుంబం ఆర్థికంగా ముందుకు సాగలేక పోతుంది. ఆరోగ్య సమస్యలతో ఆర్థిక సహాయానికి దాతల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో రేగా విష్ణు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా రోజువారి ఖర్చుల నిమిత్తం ఓ చిరు ఆర్థిక సాయాన్ని అందించేందుకు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వారి కార్యాలయంలో పదివేల రూపాయల చెక్కును అందజేశారు. రానున్న రోజుల్లో పార్టీ తరఫున సైతం అండగా ఉంటామని కొండ జంపన్నను అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. మంజులకు త్వరలోనే నయం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు ఇక మంది ఉదయ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏర్పుల సుధాకర్ రావు, టిఆర్ఎస్ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు, శిరసాని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

