కొత్తగూడెం , సెప్టెంబర్ 16 ( ఉదయం న్యూస్ )
కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ టెంపుల్ ఏరియాలో 24.10.2022 తేదీన రాత్రి 7.50 గంటలకు బడికల సందీప్ @ బాబీ అనే వ్యక్తిపై పల్లం సాయికుమార్@ జగడం సాయి కుమార్ S/o.బాబురావు,21yrs, R/o.గాజుల రాజాం బస్తీ, కొత్తగూడెం అను రౌడీషీటర్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసి హత్య చేసిన ఘటనలో ఫిర్యాదు అందుకున్న కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి గౌరవ కోర్టు వారికి తగిన ఆధారాలను సమర్పించడం జరిగింది. అప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఉన్న ఇన్స్పెక్టర్ అబ్బయ్య విచారణ అధికారిగా వ్యవహరించినారు. అనంతరం ప్రస్తుత కొత్తగూడెం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ ఇట్టి కేసు విచారణను ముందుకు సాగించారు. ఈ కేసులో వాదోపవాదాలు విన్న తర్వాత గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి నిందితుడు పల్లం సాయికుమార్ కు 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 1000/- రూపాయల జరిమానాను విధిస్తూ మంగళవారం తీర్పును వెల్లడించారు. ఇట్టి కేసులో నిందితుడికి శిక్ష పడేవిధంగా కృషిచేసిన పోలీస్ అధికారులు అబ్బయ్య,శివప్రసాద్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి లక్ష్మీ లను మరియు కోర్టు లైజైనింగ్ అధికారి వీరబాబు మరియు కోర్ట్ కానిస్టేబుల్ హేమీలాల్ లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

