U9udayam.com | Telugu Local News App Latest News
క్రైమ్ వార్తలు

సైబర్‌ కేటుగాళ్ల గరానా మోసం.. హోట‌ల్స్‌కు రేటింగ్స్ ఇస్తూ రూ.13 ల‌క్షలు పోగొట్టుకున్న యువతి

పూణె, అక్టోబర్‌ 17: ఆన్‌లైన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఎరవేసి అమాయకుల నుంచి లక్షల రూపాయలు దొంగిలిస్తున్న కేసులు ఈ మధ్యకాలంలో లెక్కకుమించి బయటపడుతున్నాయి. కేటుగాళ్ల మాయమాటలకు ఎందరో బలవుతున్నారు. రోజుకో ఎత్తుతో బాధితులను నిండా ముంచుతున్నారు. ఇంటి వద్దనే ఉంటూ ఎలాంటి కష్టం లేకుండా ఆన్‌లైన్‌ చిన్న చిన్న టాస్క్‌లు చేస్తే సులువుగా లక్షల్లో డబ్బు సంపాదించవచ్చని ఆశచూపి వలలో వేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి ఇటువంటి ఇచ్చులోనే చిక్కుకుని రూ.13 లక్షలకుపైగా డబ్బు పోగొట్టుకుని లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించింది. అసలేం జరిగిందంటే..

పూణేకు చెందిన మ‌హిళ ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అదనపు సంపాదన కోసం ఆన్‌లైన్‌లో పార్ట్‌టైం జాబ్‌ కోసం వెదుకుతున్న క్రమంలో ఆమెకు ఆన్‌లైన్‌లో హోట‌ల్స్‌కు రేటింగ్స్ ఇవ్వడం ద్వారా అధిక మొత్తం ఆర్జించ‌వ‌చ్చనే ప్రకటన చూసింది. ప్రకటనలో ఇచ్చిన ఫోన్‌ నంబర్‌ను సంప్రదించగా ఆన్‌లైన్‌లో హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్‌ ఇస్తే డబ్బు చెల్లిస్తామని జూన్‌ 18న తెలిపారు. ప్రతి రేటింగ్‌కు రూ.150 ఇస్తామని కేటుగాళ్లు నమ్మబలికారు. అయితే అందుకు కొంతమొత్తంలో పెట్టుబడి పెట్టాలని షరతు పెట్టారు. అది నమ్మని ఆమె కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టి కొన్ని హోటళ్లకు రేటింగ్‌ ఇచ్చి డబ్బు అర్జించింది కూడా.

Related posts

భారీగా నిషేదిత గంజాయిని పట్టుకున్న జిల్లా పోలీసులు

పులి గోర్ల దొంగకు జైలు శిక్ష.

సీఎం రేవంత్ ను కలిసిన జర్నలిస్టు సంఘం నేతలు.

Leave a Comment