U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణరాజకీయం

అయ్యా రాఘవేంద్ర…. మేము మున్సిపల్ కౌన్సిలర్లమేమీకు పాలేరులం కాదు

ఇన్ని బూతులు తిడతారా
పని చేస్తూ బూతులు పడాలా
పార్టీ నుండి సస్పెండ్ అయిన రాఘవ పెత్తనం ఏమిటి?
కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిలర్లు గరం గరం

ఉదయం భద్రాద్రి జిల్లా బ్యూరో అక్టోబర్ 19
పనులు చేయరు.. పనిచేసేవారని ఒప్పుకోరు ఆపై బండ బూతులు తిడతారా అయ్యా మీరు చెప్పినట్టు వినటానికి మీ కింద పని చేసే పాలేరులం కాదు మేము కూడా ప్రజలు ఎన్నుకోబడ్డ మున్సిపల్ కౌన్సిలర్ల మే అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు పై… బీ ఆర్ ఎస్ కాన్సిల్లర్లు ఫైర్. ఎమ్మెల్యే వనమా ప్రచారానికి దూరం. సమస్యలు పరిష్కరించక పోగా తిట్టిదేందీ.. ఈ వ్యవహారంపై వీలయితే రాష్ట్ర ముంత్రి, బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టి ఆర్ ను కలుస్తాం. మా బాధలు చెప్పుకుంటాం ఈ మేరకు 25కౌన్సిలర్ లు నిర్ణయం తీసుకున్నారని చెప్పిన కౌన్సిలర్ భీమా శ్రీవల్లి భర్త భీమా శ్రీధర్,మరో కాన్సిలర్ భర్త కంబంపాటి దుర్గా ప్రసాద్, మరో నాయకుడు యూసఫ్. బీ ఆర్ ఎస్ కాన్సిలర్ లతో ఎంపీ వద్ధి రాజు రవిచంద్ర కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సమావేశం ఏర్పాటు చేస్తే తాము లోపల ఉండగానే ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేంద్ర రావు బండ బూతులు తిట్టడం అందువల్లే తాము ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నామని కాన్సిలర్ ల భర్తలు, కౌన్సిల్లర్లు వెల్లడించారు.బీ ఆర్ ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన వనమా రాఘవేంద్ర రావు పెత్తనం ఎక్కువై పోయిందని భీమా శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రోజూ మా ఎన్నికలు, రేపు కౌన్సిలర్ ల ఎన్నికల్లో నేనే బీ ఫామ్ ఇచ్చేది నేనే అంటూ తిట్టారని యూసఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. హనుమా రాఘవేంద్రరావు వ్యవహార శైలి మార్చుకోకపోతే మొదటికే మోసం వస్తుందని ఓవైపు సానుకూలంగా హెచ్చరించినట్లు తెలిసింది.

Related posts

కొత్తగూడెం డిఎస్పిని అభినందించిన డిజిపి..

పార్టీ నాయకులతో జిల్లా కలెక్టర్ సమావే శం.

Leave a Comment