U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణంమరో వ్యక్తికి తీవ్ర గాయాలు

ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
ఖమ్మం కు తరలింపు.. పరిస్థితి విషమం

ఉదయం,కొత్తగూడెం నవంబర్ 18
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆదివారం జరిగిన ప్రమాద సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఇల్లందు 14 నెంబర్ బస్తీకి చెందిన భారత్ లాల్ పాసి కొడుకు నరేష్ కుమార్ పాసి(సోను)సింగరేణి కార్మికుడు (30), సాయి (25)లు బైక్ పై ఇల్లెందు నుండి కొత్తగూడెంలోని రామవరం మేషన్ కాలనీ లోని బందువుల ఇంటికి బయలుదేరారు. లక్ష్మీదేవిపల్లి మండలం లాలు తండ వద్దకు చేరుకోగా.. కొత్తగూడెం-ఇల్లెందు ప్రధాన రహదారి లో ఇసుక లోడుతో రోడ్డు పైకి వస్తున్న ట్రాక్టర్ బైకును ఢీ కొట్టింది. ఈ ఘటనలో నరేష్ కుమార్ పాసి (సోను), సాయి లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 కు సమాచారం ఇచ్చారు. వారిని వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నరేష్ కుమార్ పాసి (సోను) మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. సాయికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం కు తరలించారు. ఈ మేరకు నరేష్ కుమార్ పాసి (సోను) మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బంధువుల ఇంటికి వస్తూ మృత్యులోకానికి
రామవరం లోని మేషన్ కాలనీలో ఉంటున్న బంధువుల ఇంట్లో ఆదివారం పూజా కార్యక్రమానికి హాజరయ్యేందుకి ఇల్లందు నుండి బైక్ పై వస్తూ నరేష్ కుమార్ పాసి మృతి చెందడం తో అతని ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మృతునికి భార్య ఉంది. పూజ కార్యక్రమానికి వస్తూ… ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయా వా అంటూ నరేష్ కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు అక్కడి వారందరినీ శోకసంద్రంలో ముంచింది. అందరితో కలివిడిగా ఉండే నరేష్ కుమార్ పాసి (సోను) మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

Related posts

గద్దర్ అవార్డు కు ఎంపికైన మల్లేశం సినిమా….పద్మశాలి బిడ్డనైనందుకు గర్వపడుతున్న..…చింతకింది మల్లేశం

పద్మశాలి సంఘం ఎన్నికల కన్వీనర్ గా పుట్టా శంకరయ్య..

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Leave a Comment