U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ రాజు

ఉదయం ,కొత్తగూడెం జనవరి 06

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన ఎస్పీగా బి.రోహిత్ రాజు బాధ్యతలు చేపట్టారు.శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న రోహిత్ రాజు ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు నూతన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

2018 బ్యాచ్ నకు చెందిన ఐపీఎస్ అధికారి రోహిత్ రాజు ప్రస్తుతం హైద్రాబాద్ సిటీ సౌత్ ఈస్ట్ జోన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)గా విధులు నిర్వర్తిస్తూ భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా అయ్యారు.గతంలో భద్రాచలం ఏఎస్పీగా పని చేస్తూ పదోన్నతిపై గ్రేహౌండ్స్ ఏస్పీగా బదిలీ అయ్యారు.2023 నవంబర్ నెలలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు.ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆలోచనలోనుంచి మరో మార్గదర్శకం: బయోచార్

భద్రాద్రి కి గర్వ కారణంకలెక్టర్ జితేష్ వి.పాటిల్.

మిచౌంగ్ తుఫాను ప్రభావం వల్ల జిల్లాలో పలు చోట్ల చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

Leave a Comment