జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం సాగించాలని టి యు డబ్ల్యు జే (ఐ జే యు)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గం తీర్మానం చేసింది. గురువారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
టీయుడబ్ల్యుజే(ఐజేయూ) జిల్లా కార్యవర్గ సమావేశం కొత్తగూడెంలోని శ్రీకృష్ణ ఇన్ హాటల్లో జరిగింది. రాష్ట్ర కమిటీ సభ్యులు బి.వి.రమణారెడ్డి, జునమాల రమేష్‌ల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్‌కుమార్ అధ్యక్షతన కార్యదర్శి మొబగాపు ఆనంద్‌కుమార్, కోశాధికారి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపై యూనియన్ సాగిస్తున్న పోరాట పరిణామాలపై చర్చ సాగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలు మరియు మండలాల పరిధిలోని జర్నలిస్టుల సమస్యలను కార్యవర్గ సభ్యులు ఈ చర్చలో లేవనెత్తారు . యూనియన్ బలోపేతంతో పాటు సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేయాలని చర్చించారు. ఈ సందర్భంగా నూతనంగా తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమితులైన శ్రీనివాసరెడ్డి గారిని, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రాo నారాయణతో పాటు నూతన రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ ఆలీల కు భద్రాద్రి జిల్లా ఐజేయూ కార్యవర్గం అభినందనలు తెలిపింది. వారిని సమచితంగా గౌరవించి సత్కరించాలని జిల్లా కార్యవర్గం తీర్మానించింది. సెప్టెంబర్ 2వ వారంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యవర్గంలో తీర్మానించారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం 12 మందితో కూడిన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కనుకు వెంకటేశ్వర్లు, సత్యానంద్ , పెండ్యాల విజయభాస్కర్, బి శంకర్, జీవి నరసింహారావు, ఏ శేషగిరిరావు, శ్రీనివాసరావు, ఎర్ర ఈశ్వర్, ఏర్పుల సుధాకర్, జైనుల్లాబుద్దిన్ , డి చంద్రశేఖర్, పిల్లి రాజు , దశరధ్ రజువా, జానీ, ఆళ్లపల్లి వెంకట్, మల్లారెడ్డి, సందీప్, తదితరులు పాల్గొన్నారు.

