ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, అర్హులకు అన్యాయం చేశారనీ స్థానిక నాయకుడు సొప్పరి క్రాంతి నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి క్వార్టర్స్ లో ఇండ్లు లేనటువంటి నిరుపేదలు తలదాచుకు ఉంటున్న వారినీ పరిగణన లోకి తీసుకోలేదని సంస్థ అధికారులు ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు వెళ్ళి పోయే నిరుపేదలకు ఇళ్ళ కేటాయింపు జరపక పోవడంతో వారు రోడ్డున పడతారని అయన అవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు రానటువంటి నిరుపేదలకు ఇండ్లు వచ్చేదాకా అధికారులతో పాటు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు బాధ్యత వహించాలని, కాంగ్రెస్, సిపిఐ నాయకులను నిలదీయడం జరిగినది, ఆర్దికంగా ఉన్న వారికే లబ్ది చేకూరే విధంగా వ్యవహరించడం తగదని, వందలాది మంది దరఖాస్తు చేసుకున్న వారిలో కూడా కేవలం 19 మందికే ఇస్తామని చెప్పడం వల్ల మిగిలిన వారికీ మొండి చెయ్యి చూపడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలను మభ్యపెట్టడానికి మరల దరఖాస్తు చేసుకోవాలని అధికారుల చెబుతున్నారు అని ప్రతిసారి దరఖాస్తులు తీసుకొని కాలయాపన చేస్తున్నారు కానీ ఏ ఒక్క నిరుపేదకు ఇల్లు వచ్చిన దాఖలు లేవని ఇంతకుముందు దరఖాస్తులు చేసుకున్న దరఖాస్తు ఫామ్లు ఏమయ్యాయి అని. వెంటనే అర్హులైన ప్రతీ పేదవాడికి ఇంటి స్థలం, రేషన్ కార్డులు, కేటాయించాలని డిమాండ్ చేశారు, ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి నాయకులు, బడే రమేష్, పొన్నగంటి రాజు, గంట శీను, తాతపూడి అనిల్, మాచర్ల మహేష్, రంజిత్, మురళి,రాజు, నవీన్ ,స్వప్న, పద్మ, ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు.
previous post

