“కాసాని ఐలయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి నివాళులు అర్పించిన రాష్ట్ర మైనారిటీ నాయకులు నయీమ్ ఖురేషి గారు,సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా గారు,టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు గారు,
సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ కాసాని ఐలయ్య గారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి గురైన నయీమ్ ఖురేషి… వారు మాట్లాడుతూ కాసాని ఐలయ్య గారు, తన తండ్రి గారైన స్వర్గీయ రహీం ఖురేషి గారి మిత్రుడని చాలా గొప్ప నాయకుడూ
మరణం పట్ల బాధకరమైన విచారం వ్యక్తం చేశారు. కొత్తగూడెం సుజాతనగర్ ప్రాంతం ఒక ఉద్యమ నాయకున్ని కోల్పోయిందని గత కొంతకాలంగా కిడ్నీ డయాలసిస్ తో బాధపడుతూ చాలాకాలంగా అనారోగ్యంగా ఉన్న ప్రజల పక్షాన పోరాడుతూనే చివరి శ్వాస విడిచారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ అల్లాహ్ ను వేడుకుంటూ పార్దివ దేహానికి నయీమ్ ఖురేషి నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు….

