అనుమతి లేకుండా నిర్మాణాలు సాధ్యమేనా..
మమ్మల్ని ఆపేదెవరుంటున్న బడా బాబులు…
అధికారుల అలసత్వం కారణమా…
ఎవరేం చేయలేరు అనే ధీమానా..
సామాన్యుడికి ఒక లెక్క బడా బాబుకు ఒక లెక్క..
లెక్క సరిచేసే వారెవరు…
ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.
ఎవరేమన్నా పట్టించుకునేది లేదంటూ మమ్మల్ని ఎవరు ఆపలేరు అంటూ కొంతమంది బడాబాబులు కొత్తగూడెంలో అక్రమ నిర్మాణాలకు తెరతీశారు.. రాత్రి పగలు తేడా లేకుండా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు.. సామాన్యుడు భార్యాపిల్లల తను నివాసం ఉండడానికి ఒక చిన్నపాటి గృహ నిర్మాణం చేపడితే ఇంటి ముందు ఇసుక పోసింది మొదలు పని మొదలుపెట్టే దాకా ఎవరో ఒక అధికారి ఏదో ఒక వంకతో నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం పరిపాటే.. గృహ నిర్మాణం చేపట్టే సదరు వ్యక్తులు తెలిసి తెలియక పనులు మొదలు పెడితే అనుమతులు లేవంటూ వాటిని ఆపేయడమే కాకుండా కూల్చివేసే అధికారులు బడా బాబులు చేపట్టే నిర్మాణ పనులను మాత్రం చూసి చూడకుండా వదిలేయడం సర్వసాధారణమైపోతుంది. ఈ నేపథ్యంలోనే సదరు బడాబాబులు అనుమతులు లేకుండానే అంతస్తులు అనుమతులు లేకుండానే కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మాణాలు పూర్తి చేసేస్తున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీగా ఉన్నప్పుడే రెచ్చిపోతున్న బడాబాబులు కార్పొరేషన్ పేరుతో కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టేస్తున్నారు. కొన్ని చోట్ల ఒక ఇంటికి ఉండే నెంబర్ను మరొక ఇంటికి వేసి గృహ నిర్మాణం ఉన్న నెంబర్లకు గాను మరొక నెంబర్లు వేరే బహుళ అంతస్తుల నిర్మాణాలకు వేసి మున్సిపాలిటీ అధికారులను బురిడీ కొట్టిస్తున్నారు. పట్టాలు లేకుండా పర్మిషన్ రాకుండా కమర్షియల్ బిల్డింగులనే నడిరోడ్డుపై నిర్మాణాలు చేసేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేసే బడా బాబులకు అనుమతులు ఎవరు ఇచ్చారు కాగితాలకు సంబంధించిన అంశాలను అధికారులు లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు అనుమతి లేని అక్రమ కట్టడాలను నిర్మూలించకపోతే మున్సిపల్ శాఖ పై అధికారులపై అనుమానాలు కలిగే అవకాశాలు లేకపోలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏ మేరకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే…
next post

