U9udayam.com | Telugu Local News App Latest News
క్రైమ్ వార్తలుతెలంగాణరాజకీయం

మీడియాపై దాడులుచేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలి.

టీయూడబ్ల్యూజే ఐజేయు భద్రాద్రి జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్.

మహా న్యూస్ టీవీ ఛానల్ ఆఫీస్ పై దాడిని ఖండిస్తూ కొత్తగూడెంలో విలేకరుల నిరసన.

భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం

మీడియాపై దాడులు చేసే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్ అన్నారు. మహా న్యూస్ టీవీ ఛానల్ ఆఫీస్ పై బి ఆర్ ఎస్ గుండాలు దాడి చేసే విధ్వంశాలు సృష్టించడాన్ని నివసిస్తూ కొత్తగూడెంలో విలేకరులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ మాట్లాడుతూ మీడియాపై దాడులు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు. మీడియాపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పార్టీలు ఏవైనా గాని అది అధికారపక్షమైన, ప్రతిపక్షమైన మీడియా స్వేచ్ఛను కాపాడకపోతే సమాజం ముందుకు పోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ఎర్రాఈశ్వర్ లక్ష్మణ్ రాజేందర్ బాదావత్ దశరథ్, రాజేష్, ఖలీమ్, భాస్కర్, శివ కృష్ణ కృష్ణంరాజు, అనిల్ CH.V.నరసింహారావు, శేఖర్, రవికుమార్, బాబు, నజీర్, మజీద్ , రాందాస్ , శ్రీను, కొప్పుల రమేష్, పిట్టల రమేష్ , గండికోట కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Related posts

ఏటీసీ ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు – జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

గౌతంపూర్ గ్రామ సభలో అధికారులను నిలదీసిన బీజేపి నేతలు..

రానున్న గ్రామీణ ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపు

Leave a Comment