U9udayam.com | Telugu Local News App Latest News
క్రైమ్ వార్తలుతెలంగాణ

తనకి న్యాయం చేయాలంటూ గ్రీవిన్స్ లో పిర్యాదు చేసిన చింత రమేష్

కొత్తగూడెం , జూన్ 30 ( ఉదయం న్యూస్ )

తనకి న్యాయం చేయాలంటూ సోమవారం జిల్లా సమీకృత కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో లక్ష్మిదేవి పల్లి మండలం, హమాలి కాలనీ కి చెందిన చింత రమేష్ పిర్యాదు చేసారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాల మేరకు పాల్వంచ పెద్దమ్మతల్లి గుడి సమీపంలో తనపై జరిగిన దాడి కారణంగా కొంతమంది పై ఎస్టీ ఎస్సి కేసు నమోదు అయిందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆకేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నదని తెలిపారు. ఈ కేసును ముందుకు తీసుకెళ్లేందుకు తగిన ఖర్చులు లేనందున ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం నుండి తమకు అందించే ఆర్థిక సహాయం సకాలంలో అందించాలని గ్రీవెన్స్ లో పిర్యాదు ఇచ్చామన్నారు. చింత రమేష్ తో పాటు కొంపెల్లి వీరన్న , ఉబ్బని రాజు , రావు మధు ఉన్నారు.

Related posts

ఒక్క రూపాయి ఇచ్చి.. మీ మద్దతు తెలపండి ఐదేళ్లపాటు ఒక్క రూపాయి తీసుకోకుండా సేవకుడిగా పని చేస్తా..

యస్.సి.వర్గీకరణపై అనుకూల ప్రకటన,బి.సి.కులగనణపై కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పాలాభిషేకం

హవ్వ… సింగరేణిలో ఇంత నాసిరకమా…

Leave a Comment