U9udayam.com | Telugu Local News App Latest News
క్రైమ్ వార్తలుతెలంగాణ

గ్రామ పంచాయతీలో తిష్ట వేసిన షాడో

ఉద్యోగం ఒకరిది పెత్తనం మరొకరిది

రమేషుడి ఆగడలతో ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలు

లక్ష్మిదేవి పల్లి , సెప్టెంబర్ 14 ( ఉదయం న్యూస్ )

గ్రామ పంచాయతీ ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే షాడో అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితులు లక్ష్మిదేవి పల్లి మండలం చాతకొండ గ్రామ పంచాయతీ లో చోటుచేసుకుంది. ఉద్యోగం ఒకరిదైతే పెత్తనం మరొకరిది అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. రమేషుడు తన మేదోశెక్తికి పదును పెడుతూ తోకలను అందుబాటులో పెట్టుకొని గ్రామ పంచాయతీ కి ఆదాయం అధికంగా వచ్చే ఇసుక ర్యాంప్ అనదికారకంగా రవాణా చేసే అక్రమ ఇసుక దందాకి తెరలేపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం నిర్వహించే ఉద్యోగినిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి షాడో గ్రామ ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నట్ట గ్రామ పంచాయతీ ప్రజలు పేర్కొంటున్న సందర్భాలు అనేకం కనిపిస్తున్నాయి. చాతకొండ గ్రామ పంచాయతీ లో వనరులు కలిగి ఉన్న ఇసుక ర్యాంప్ అక్రమ దందా నుండి కాపాడలేని పంచాయతీ కార్యదర్శి మాకు వద్దు అంటూ స్థానిక గ్రామ పంచాయితీ ప్రజలు వాపోతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కుపన్ల విషయంలో షాడో ట్రాక్టర్లకు సంబంధించిన కొందరిపై మక్కువ చూపుతూ మరికొందరిపై సవితి తల్లి ప్రేమ చూపిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. గ్రామ సమష్యలపై పంచాయతీ అధికారితో చర్చించాలంటే ముందుగా షాడో తో మాట్లాడాలని లేకుంటే గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు కుంటిన పడతాయని ఆరోపిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి పై ఆమె భర్త అగడలపై మండల అధికారికి తెలియజేసినట్లు బాధిత ప్రజలు తెలిపారు. గతంలో పని చేసిన గ్రామ పంచాయతీ లో షాడో తన వైఖరికి గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలు ఉన్నాయని ఆరోపణలున్నాయి. గ్రామ పంచాయతీ లో షాడో ప్రవర్తనపై పిర్యాదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బాధితులు పేర్కొన్నారు.

Related posts

అబ్రహం భార్య ఆదిమూలపు శైలజ హఠాన్మరణం.

జర్నలిస్టులకు ఆధార్ ప్రత్యేక కౌంటర్..టీయూడబ్ల్యూజే ఐజేయు విజ్ఞప్తి.

పద్మశాలి సభ్యత్వం చివరి సభ్యుడి వరకు చేరాలి ..

Leave a Comment